Police Station Fire Accident : సాలూరు పోలీస్ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం..

Police Station Fire Accident : సాలూరు పోలీస్ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం..
X
Police Station Fire Accident : పార్వతీపురం జిల్లా సాలూరు పోలీస్‌ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది

Police Station Fire Accident : పార్వతీపురం జిల్లా సాలూరు పోలీస్‌ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. సీజ్‌ చేసిన క్రాకర్స్‌ పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

స్పాట్‌కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. రాపిడి జరగడం వల్లే క్రాకర్స్‌ పేలి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. పేలిన క్రాకర్స్ విలువ 3లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక సీజ్‌ చేసిన క్రాకర్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఎందుకు ఉంచారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story