ప్రపంచంలో 7 నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం.. 8 నెలల తర్వాత భక్తులకు దర్శనం

ప్రపంచంలో 7 నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం.. 8 నెలల తర్వాత భక్తులకు దర్శనం
ప్రతి ఏడాది కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు స్వామి వారి దర్శనం కలుగుతుంది.

కర్నూలు జిల్లాలో కొలువైన సంగమేశ్వరస్వామి 8 నెలల తర్వాత భక్తులకు తొలిసారి దర్శనమిచ్చారు. గతేడాది జులై 20న ఆలయం కృష్ణానది నీటిలో ఒదిగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించింది. ప్రస్తుతం శ్రీశైల జలాశయ నీటి మట్టం 839 అడుగులకు చేరుకోవడంతో సంగమేశ్వర ఆలయం ప్రహరీ, ముఖద్వారం, ఆలయంలోని దేవతామూర్తులు కనిపించాయి. ఆలయం బయటకు రావడంతో పురోహితులు ప్రత్యేక పూజలు చేశారు. రేపటి నుంచి భక్తులకు స్వామివారిని దర్శించుకోవచ్చని ఆలయ పూజరులు తెలిపారు.

ప్రతి ఏడాది కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు స్వామి వారి దర్శనం కలుగుతుంది. చివరి సారిగా గతేడాది జూలైలో అర్చకులు సంగమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచంలో 7 నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు కలిసే ప్రదేశాన్నే సంగమేశ్వరం అంటారు. ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడు పేరున్న నది.. మిగిలినవన్నీ స్త్రీ పేరున్న నదులే. భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే.. మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్తాయి. ఈ నదులన్నీ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం, శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ చివరికి సముద్రంలో కలిసిపోతాయి.

ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. వేల సంవత్సరాల ఇక్కడ ప్రతిష్టించిన వేపలింగం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఏడు నదులు కలిసే చోటున ఉన్న శివుడి ప్రతిరూపమైన వేపలింగాన్ని సందర్శిస్తే నరకలోక ప్రవేశం నుంచి తప్పించుకోవచ్చని భక్తులు నమ్ముతారు.


Tags

Read MoreRead Less
Next Story