SANKRANTHI: రైతు కష్టానికి గౌరవం తెలిపే మహోత్సవం సంక్రాంతి

SANKRANTHI: రైతు కష్టానికి గౌరవం తెలిపే మహోత్సవం సంక్రాంతి
X
పే­రు­లో­నే కాం­తి నిం­డిన పం­డుగ.. ఆం­ధ్రుల సం­స్కృ­తి–సం­ప్ర­దా­యా­ల­కు ప్ర­తీక సంక్రాంతి..

భోగి మంటల వేడి…

పిండి వంటల రుచి…

రంగురంగుల ముగ్గులు…

గొబ్బెమ్మల అందం…

పశువుల పూజ…

హరిదాసుల కీర్తనలు…

బంధుత్వాల అనుబంధం…

ఇవ­న్నీ ఒక్క­చోట కలి­సే పం­డు­గే సం­క్రాం­తి. పే­రు­లో­నే కాం­తి నిం­డిన ఈ పం­డుగ, ఆం­ధ్రుల సం­స్కృ­తి–సం­ప్ర­దా­యా­ల­కు ప్ర­తీక. రైతు కష్టా­ని­కి గౌ­ర­వం తె­లి­పే పం­డు­గ­గా, పల్లె జీవన సౌం­ద­ర్యా­న్ని చాటే వే­డు­క­గా, కు­టుంబ బం­ధా­ల­ను మరింత బల­ప­రి­చే పం­డు­గ­గా సం­క్రాం­తి ప్ర­త్యేక స్థా­నం సం­పా­దిం­చు­కుం­ది. పంట చే­తి­కొ­చ్చిన ఆనం­దా­న్ని, ప్ర­కృ­తి­కి కృ­త­జ్ఞ­త­ను, దే­వ­తల ఆశీ­స్సు­ల­ను ఒకే­సా­రి కో­రు­కు­నే సం­ద­ర్భ­మే ఈ నా­లు­గు రో­జుల పం­డుగ.

సంక్రాంతి.. రైతు జీవితానికి పండుగ

ఆరు­గా­లం కష్ట­ప­డి రైతు పం­డిం­చిన పంట ఇం­టి­కి చేరే సమ­య­మి­ది. చలి­కా­లం చి­వ­ర్లో, పంట పొ­లా­లు పచ్చ­గా మె­రి­సే వేళ, ఆ ఆనం­దా­న్ని పం­డు­గ­గా మలు­చు­కు­నే సం­ప్ర­దా­యం మనది. అం­దు­కే సం­క్రాం­తి­ని వ్య­వ­సాయ పం­డు­గ­గా అభి­వ­ర్ణి­స్తా­రు. పా­డి­పం­ట­లు, పశు­సం­పద, గ్రా­మీణ వా­తా­వ­ర­ణం – ఇవ­న్నీ సం­క్రాం­తి­లో మరింత ఉజ్వ­లం­గా కని­పి­స్తా­యి. పట్ట­ణా­ల్లో ఉన్న­వా­రు కూడా ఈ పం­డుగ కోసం స్వ­గ్రా­మా­ల­కు చే­రు­కో­వ­డం, కు­టుంబ సభ్యు­ల­తో కలసి ఆనం­దిం­చ­డం ఈ పం­డుగ ప్ర­త్యే­కత. పం­డు­గ­లో రెం­డవ రోజు మకర సం­క్రాం­తి. సూ­ర్యు­డు మకర రా­శి­లో ప్ర­వే­శిం­చే పవి­త్ర ఘడి­య­గా ఈ రో­జు­ను పరి­గ­ణి­స్తా­రు. అం­దు­కే ఈ రో­జం­తా సూ­ర్యా­రా­ధ­న­కు ప్రా­ధా­న్యం ఉం­టుం­ది. ఉదయం స్నా­నా­దు­లు పూ­ర్తి చేసి, పిం­డి వం­ట­లు – పొం­గ­లి, అరి­సె­లు, బూ­రె­లు, గా­రె­లు వంటి సం­ప్ర­దాయ వం­ట­లు తయా­రు చేసి సూ­ర్య­దే­వు­ని­కి నై­వే­ద్యం­గా సమ­ర్పి­స్తా­రు. వ్వు­లు, దానం చే­య­డం ఈ రోజు ప్ర­త్యేక ఆచా­రం. ఇది దానం చే­సి­న­వా­రి­కి సూ­ర్య భగ­వా­ను­డి అను­గ్ర­హం కలు­గు­తుం­ద­ని వి­శ్వా­సం. ఇంటి ముం­దు రం­గు­రం­గుల ము­గ్గు­లు వేసి, పూ­ల­తో అలం­క­రిం­చి, పే­డ­తో చే­సిన గొ­బ్బె­మ్మ­ల­ను ఉం­చు­తా­రు. ఈ గొ­బ్బె­మ్మ­లు గ్రా­మీణ సం­స్కృ­తి­కి ప్ర­తీ­క­గా ని­లు­స్తా­యి. హి­ళ­లు ము­గ్గుల చు­ట్టూ పా­ట­లు పా­డు­తూ, ఆట­పా­ట­ల­తో ఆనం­ది­స్తా­రు. పి­ల్ల­లు గా­లి­ప­టా­లు ఎగు­ర­వే­స్తూ ఆకా­శా­న్ని రం­గు­ల­మ­యం చే­స్తా­రు. గ్రా­మా­ల్లో ఈ రోజు ఒక పం­డుగ వా­తా­వ­ర­ణం నె­ల­కొం­టుం­ది.

సం­క్రాం­తి పం­డు­గ­లో మూడవ రోజు కనుమ. ఇది పూ­ర్తి­గా రై­తు­ల­కు, పశు­సం­ప­ద­కు అం­కి­త­మైన రోజు. వ్య­వ­సా­యం­లో తమకు తో­డు­గా ని­లి­చిన పశు­వు­ల­ను ఈ రోజు ప్ర­త్యే­కం­గా పూ­జి­స్తా­రు. ఎడ్ల­కు, ఆవు­ల­కు స్నా­నా­లు చే­యిం­చి, కొ­మ్ము­ల­కు రం­గు­లు వేసి, పూ­ల­తో అలం­క­రి­స్తా­రు. ము పం­డిం­చిన కొ­త్త పం­ట­తో పొం­గ­లి తయా­రు చేసి పశు­వు­ల­కు నై­వే­ద్యం­గా పె­డ­తా­రు. ఇది పశు­వుల పట్ల కృ­త­జ్ఞ­త­ను వ్య­క్త­ప­ర­చే ఆచా­రం. కనుమ రోజు కు­టుంబ సభ్యు­లు, బం­ధు­వు­లు అం­ద­రూ కలి­సి విం­దు భో­జ­నా­లు చే­స్తా­రు. గ్రా­మా­ల్లో కో­డి­పం­దా­లు, ఎడ్ల పం­దా­లు వంటి సం­ప్ర­దాయ ఆటలు జో­రు­గా జరు­గు­తా­యి. సం­క్రాం­తి పం­డు­గ­లో నా­లు­గవ రోజు ము­క్క­నుమ. దీ­ని­కి అం­తంత మా­త్ర­పు ప్రా­ధా­న్యత ఉన్న­ప్ప­టి­కీ, ఉత్త­రాం­ధ్ర ప్రాం­తా­ల్లో ప్ర­త్యే­కం­గా జరు­పు­కుం­టా­రు. ఈ రోజు మాం­సా­హార విం­దు­లు ఏర్పా­టు చే­య­డం ఆన­వా­యి­తీ. అయి­తే కనుమ, ము­క్క­నుమ రో­జు­ల్లో ఎక్కు­వ­గా ప్ర­యా­ణం చే­య­కూ­డ­ద­నే నమ్మ­కం ఉంది.ఆ రోజు దే­వ­త­లం­ద­రూ మన ఇం­టి­కి వస్తా­ర­ని, శని సం­బం­ధిత నక్ష­త్ర ప్ర­భా­వం ఎక్కు­వ­గా ఉం­టుం­ద­ని, ప్ర­యా­ణా­లు చే­స్తే అప­శ­కు­నం జరు­గు­తుం­ద­ని పం­డి­తు­లు చె­బు­తా­రు. అం­దు­కే ఇం­ట్లో­నే ఉండి కు­టుం­బం­తో సమయం గడ­ప­డం శ్రే­య­స్క­ర­మ­ని భా­వి­స్తా­రు. కనుమ రోజున కుటుంబంతో కలిసి, బంధువులతో కలిసి విందు భోజనాలు చేస్తారు.

Tags

Next Story