SANKRANTHI: సొంతూరు బాట పట్టిన జనం

SANKRANTHI: సొంతూరు బాట పట్టిన జనం
X
విజయవాడ-హైదరాబాద్ హైవేపై పెరిగిన రద్దీ

సంక్రాంతి పండగ సెలవులు ప్రారంభం కావటంతో ప్రజలంతా సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ క్రమంలో హైదరాబాద్- విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. ఈరోజు ఉదయమే హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్‌, పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.

సం­క్రాం­తి పం­డుగ సమీ­పి­స్తుం­డ­టం­తో రహ­దా­రు­ల­పై ప్ర­యా­ణి­కుల రద్దీ ఇంకా పె­రి­గే సూ­చ­న­లు కని­పి­స్తు­న్నా­యి. ము­ఖ్యం­గా హై­ద­రా­బా­ద్‌ నుం­చి ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­కు వె­ళ్లే వా­హ­నా­లు ఉమ్మ­డి నల్గొండ జి­ల్లా మీ­దు­గా భారీ సం­ఖ్య­లో ప్ర­యా­ణిం­చ­ను­న్న నే­ప­థ్యం­లో ట్రా­ఫి­క్ సమ­స్య­లు తలె­త్త­కుం­డా పో­లీ­సు­లు వి­స్తృత ఏర్పా­ట్లు చే­స్తు­న్నా­రు. జా­తీయ రహ­దా­రు­ల­పై జరు­గు­తు­న్న వం­తె­నల ని­ర్మా­ణా­లు, టో­ల్‌ గే­ట్ల వద్ద వా­హ­నాల ని­లు­పు­దల వంటి అం­శా­ల­ను పరి­గ­ణ­న­లో­కి తీ­సు­కు­ని ముం­ద­స్తు­గా ప్ర­ణా­ళి­క­లు రూ­పొం­దిం­చా­రు. సం­క్రాం­తి ముం­దు, పం­డుగ రో­జు­లు, పం­డుగ అనం­త­రం ప్ర­యా­ణి­కు­ల­కు ఎలాం­టి ఇబ్బం­దు­లు ఎదు­రు­కా­కుం­డా ట్రా­ఫి­క్ డై­వ­ర్ష­న్లు, నిఘా చర్య­లు అమలు చే­యా­ల­ని సూ­ర్యా­పేట జి­ల్లా పో­లీ­స్‌ అధి­కా­రు­లు ని­ర్ణ­యిం­చా­రు. రద్దీ ఎక్కు­వ­గా ఉండే మా­ర్గా­ల­ను గు­ర్తిం­చి ప్ర­త్యా­మ్నాయ దా­రు­ల­ను అం­దు­బా­టు­లో­కి తీ­సు­కు­వ­స్తు­న్నా­రు. హై­ద­రా­బా­ద్‌ నుం­చి గుం­టూ­రు వైపు వె­ళ్లే వా­హ­నా­ల­ను నా­ర్క­ట్‌­ప­ల్లి వద్ద దారి మళ్లిం­చ­ను­న్నా­రు. అక్క­డి నుం­చి నల్గొండ, మి­ర్యా­ల­గూడ, పి­గు­డు­రా­ళ్ల మీ­దు­గా గుం­టూ­రు వైపు వె­ళ్లే­లా ఏర్పా­ట్లు చే­శా­రు. ఈ మా­ర్గం ద్వా­రా వా­హ­నా­లు సజా­వు­గా ప్ర­యా­ణిం­చే అవ­కా­శం ఉం­టుం­ద­ని అధి­కా­రు­లు తె­లి­పా­రు. రా­జ­మం­డ్రి, వి­శా­ఖ­ప­ట్నం వైపు వె­ళ్లే వా­హ­నా­ల­కు కూడా ప్ర­త్యేక మా­ర్గా­ల­ను సూ­చిం­చా­రు. నకి­రే­క­ల్‌ మీ­దు­గా అర్వ­ప­ల్లి, మరి­పెడ బం­గ్లా, ఖమ్మం మీ­దు­గా వా­హ­నా­ల­ను మళ్లి­స్తా­రు. ఈ మా­ర్గం­లో ట్రా­ఫి­క్ అం­త­రా­యం ఏర్ప­డి­తే, టే­కు­మ­ట్ల నుం­చి ఖమ్మం జా­తీయ రహ­దా­రి మీ­దు­గా రా­జ­మం­డ్రి ది­శ­గా వా­హ­నా­ల­ను పంపే ఏర్పా­ట్లు చే­శా­రు.

హై­ద­రా­బా­ద్‌–వి­జ­య­వాడ రహ­దా­రి­పై ఇప్ప­టి­వ­ర­కు అమ­లు­లో ఉన్న టే­కు­మ­ట్ల డై­వ­ర్ష­న్‌­ను తొ­ల­గిం­చ­ను­న్నా­రు. గతం­లో టే­కు­మ­ట్ల వద్ద యూ-టర్న్ తీ­సు­కు­ని తి­రి­గి సూ­ర్యా­పేట వైపు రా­వా­ల్సి ఉం­డే­ది. అయి­తే, ప్ర­స్తు­తం జా­తీయ రహ­దా­రి­పై నే­రు­గా వా­హ­నా­లు వె­ళ్లే­లా తా­త్కా­లిక రహ­దా­రి­ని ని­ర్మిం­చా­రు ఖమ్మం నుం­చి హై­ద­రా­బా­ద్‌ వె­ళ్లే వా­హ­నా­ల­కు కూడా కొ­త్త ప్ర­ణా­ళి­క­లు రూ­పొం­దిం­చా­రు. గతం­లో రా­యి­ని­గూ­డెం వైపు వె­ళ్లి యూ-టర్న్ తీ­సు­కో­వా­ల్సి ఉం­డే­ది. ఇప్పు­డు చి­వ్వెంల, ఐలా­పు­రం వద్ద దారి మళ్లిం­చి సూ­ర్యా­పేట మీ­దు­గా హై­ద­రా­బా­ద్‌­కు వె­ళ్లే ఏర్పా­ట్లు చే­శా­రు.

Tags

Next Story