ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాల శోభ!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాల శోభ అంబరాన్నంటుతోంది. పల్లెల నుంచి పట్నాల వరకు జనం ఉత్సవాల్లో నిమగ్నమయ్యారు.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాల శోభ!
X

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాల శోభ అంబరాన్నంటుతోంది. పల్లెల నుంచి పట్నాల వరకు జనం ఉత్సవాల్లో నిమగ్నమయ్యారు. వేకువ జామున చీకట్లను చీల్చుకుంటూ భోగి మంటల కాంతులు విరజిమ్మాయి. ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలతో తెలుగు ముంగిళ్లు ముస్తాబయ్యాయి. వాడవాడలా చిన్నాపెద్ద సందడి చేస్తున్నారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజు భోగి వేడుకలు భోగ భాగ్యాలకు నాందిగా నిలవాలని వేడుకుటున్నారు. ప్రకృతిలో ప్రత్యక్షమైన కొత్త అందాలకు కోటి ఆశలతో స్వాగతం పలుకుతున్నారు. మనసులోని చెడు దహించుకుపోవాలని కోరుకుంటూ భోగి మంటలు వేశారు. మంచిని కాంక్షిస్తూ మకర సంక్రాంతి వేడుకల్లో భాగమైన భోగిని ఘనంగా జరుపుకున్నారు. ఆరు గాలం శ్రమించిన పంట చేతికొచ్చే వేళ సరికొత్త సంతోషాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story

RELATED STORIES