ఏపీలో దారుణం.. సరస్వతి దేవి విగ్రహంపై మద్యం పోసి, బాటిళ్లతో దాడి

ఏపీలో దారుణం.. సరస్వతి దేవి విగ్రహంపై మద్యం పోసి, బాటిళ్లతో దాడి

ఏపీలో దేవాలయాలపై దాడులు ఆగడంలేదు. తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో మరో దారణం చోటు చేసుకుంది. శృంగేరీ శంకర మఠం సమీపంలో ఉన్న సరస్వతీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహంపై మద్యం పోసి, బాటిళ్లతో దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

విగ్రహం ధ్వంసంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవతల విగ్రహాలపై దాడులు జరుగుతున్నా.. అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story