చిత్తూరు జిల్లాలోని మద్యం దుకాణాల్లో స్కామ్‌?

చిత్తూరు జిల్లాలోని మద్యం దుకాణాల్లో స్కామ్‌?
విషయం బయటకు రాగానే ఇద్దరు ఏఏవోలు పరారయ్యారు.

చిత్తూరు జిల్లాలోని మద్యం దుకాణాల్లో భారీ స్కామ్‌ వెలుగు చూసింది. సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాలెం మద్యం దుకాణాల్లో అసిస్టెంట్‌ అకౌంట్‌ ఆఫీసర్లుగా పనిచేస్తున్న ఇద్దరు అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.. మద్యం దుకాణాలకు బాబు రెడ్డి, దుర్గా ప్రసాద్‌ అసిస్టెంట్‌ అకౌంట్‌ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. బ్యాంకులో చేయాల్సిన నగదును సూపర్‌ వైజర్ల నుంచి తీసుకుని పక్కదారి పట్టించినట్లుగా తెలుస్తోంది.. వరదయ్యపాలెం ఏఏవోను అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నట్లుగా సమాచారం. అయితే, అధికారులు మాత్రం దీనికి సంబంధించి ఇంకా ధ్రువీకరించలేదు.

చాలా కాలంగా ఈ వ్యవహారం నడుస్తున్నట్లుగా కొంతమంది ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా పక్కా ప్లాన్‌ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే, అధికారిక వెబ్‌సైట్లలో లావాదేవీలు వ్యత్యాసం రావడంతో గుర్తించిన అధికారులు.. ఉన్నతాధికారుల లాగిన్‌తో జమ అయినట్లుగా మార్పులు జరిగినట్లుగా తేల్చారు.. విషయం బయటకు రాగానే ఇద్దరు ఏఏవోలు పరారయ్యారు. అయితే దర్యాప్తు చేపట్టిన అధికారులు ఒకరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు.


Tags

Read MoreRead Less
Next Story