విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. దేహశుద్ధి చేసిన గ్రామస్తులు..!

విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. దేహశుద్ధి చేసిన గ్రామస్తులు..!
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు విచక్షణ మరిచాడు. తన వద్ద చదివే విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించి దెబ్బలు తిన్నాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరు మడలం లైదాం గ్రామంలో చోటుచేసుకుంది.

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు విచక్షణ మరిచాడు. తన వద్ద చదివే విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించి దెబ్బలు తిన్నాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరు మడలం లైదాం గ్రామంలో చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో మురళీకృష్ణ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. క్లాస్ రూమ్‌లో చెప్పిన మాట వినలేదని మురళీకృష్ణ.. విద్యార్థినిలతో బూతుపురాణం అందుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థినులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడిని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా మార్పు రానందునే చితకబాదామని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

Tags

Next Story