Trains Cancellation: ఏపీలో 44 రైళ్లు రద్దు.. ఏపీలో ప్రయాణికులకు అలర్ట్.

Trains Cancellation: ఏపీలో 44 రైళ్లు రద్దు.. ఏపీలో ప్రయాణికులకు అలర్ట్.
నేటి నుంచి మూడురోజుల‌పాటు ప‌లు

భారీ వర్షాలు, వరదలు విజయవాడ ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఇటీవల ట్రాక్‌లపై వరదనీరు చేరడంతో పలు చోట్ల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 6, 7, 8, 9 తేదీల్లో పలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విజయవాడ డీఆర్‌ఎం ‘ఎక్స్‌’ ఖాతాలో వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మధ్య సర్వీసులందించే పలు రైళ్లను దారిమళ్లిస్తున్నట్లు తెలిపారు.

07575 తెనాలి- విజయవాడ, 07500 విజయవాడ- గూడూరు, 07896 మచిలీపట్నం- విజయవాడ, 07769 విజయవాడ- మచిలీపట్నం, 07871/07872 మచిలీపట్నం- గుడివాడ, 07898/07899 మచిలీపట్నం- విజయవాడ, 07461 విజయవాడ- ఒంగోలు, 07576 ఒంగోలు- విజయవాడ, 07867 మచిలీపట్నం- విజయవాడ రైళ్లు రద్దు చేశారు.

07866 విజయవాడ- మచిలీపట్నం, 07770 మచిలీపట్నం- విజయవాడ, 07283 విజయవాడ- భీమవరం, 07772 భీమవరం-నిడదవోలు, 07882 నిడదవోలు- భీమవరం, 07865 భీమవరం- విజయవాడ, 07459 విజయవాడ-రాజమండ్రి, 17257 విజయవాడ- కాకినాడ పోర్ట్, 07868/07869 గుడివాడ-మచిలీపట్నం, 07885/07886 భీమవరం- నిడదవోలు, 07281 నరసాపురం-గుంటూరు, 07460 రాజమండ్రి- విజయవాడ, 07877 విజయవాడ- భీమవరం, 07885/07886 భీమవరం- నిడదవోలు, 17263 భీమవరం- నరసాపురం, 07673/07674 నరసాపురం- నిడదవోలు, 07863 నరసాపురం- విజయవాడ, 07768 విజయవాడ-రాజమండ్రి, 07767 రాజమండ్రి-విజయవాడ రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. 17258 కాకినాడ పోర్ట్‌- విజయవాడ ( ఈ నెల 6వ తేదీ నుంచి 9 వరకు), 07977/07978 విజయవాడ- బిట్రగుంట( ఈ నెల 6 నుంచి 9 వరకు), 07784/07785 గుంటూరు- రేపల్లె(ఈ నెల 6 నుంచి 9 వరకు), 17269 విజయవాడ- నరసాపురం( ఈ నెల 7 నుంచి 9 వరకు) రద్దు చేశారు.


Tags

Next Story