రాజ్ భవన్‌లో ఎస్ఈసీ నిమ్మగడ్డ, సీఎస్ ఆదిత్యనాథ్‌తో గవర్నర్ భేటీ

రాజ్ భవన్‌లో ఎస్ఈసీ నిమ్మగడ్డ, సీఎస్ ఆదిత్యనాథ్‌తో గవర్నర్ భేటీ
పంచాయతీ అధికారులపై ఎస్ఈసీ అభిశంసన ఎపిసోడ్ పై ప్రధానంగా చర్చ

*రాజ్ భవన్ చేరుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ, సీఎస్ ఆదిత్యనాథ్

*ఇద్దరితో విడివిడిగా భేటీ అయిన గవర్నర్ బిశ్వభూషణ్

*పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై ప్రధాన చర్చ

*ప్రభుత్వం-ఎస్ఈసీ మధ్య గ్యాప్ తగ్గించే ప్రయత్నాల్లో గవర్నర్

*అవసరమైతే ఇద్దరిని ఒకేసారి కూర్చొబెట్టి చర్చించే అవకాశం

*ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీ-ప్రభుత్వం సహకరించుకోవాలని సూచించనున్న గవర్నర్

*పంచాయతీ అధికారులపై ఎస్ఈసీ అభిశంసన ఎపిసోడ్ పై ప్రధానంగా చర్చ

*చర్యలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని వివరించనున్న నిమ్మగడ్డ

*పోలింగ్, వ్యాక్సినేషన్ ప్రక్రియపైనా గవర్నర్ సమీక్షించే అవకాశం

*శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించనున్న గవర్నర్

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ రాజ్ భవన్ చేరుకున్నారు. ఇద్దరితో గవర్నర్ బిశ్వభూషణ్ విడివిడిగా భేటీ అయ్యారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియపైనే ప్రధానంగా చర్చిస్తున్నారు. ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య ఏర్పడిన గ్యాప్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు గవర్నర్. అవసరమైతే ఇద్దరిని ఒకేసారి కూర్చొబెట్టి చర్చించనున్నారు.

ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీ, ప్రభుత్వం పరస్పరం సహకరించుకోవాలని సూచించనున్నారు. పంచాయతీ అధికారులపై ఎస్ఈసీ అభిశంసన ఎపిసోడ్ కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో నిమ్మగడ్డ గవర్నర్ కు వివరించనున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఇరువురికి ఆదేశించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story