కుల ధృవీకరణ పత్రాలపై సీఎం జగన్‌ ఫోటో లేకుండా చర్యలు తీసుకోవాలి : నిమ్మగడ్డ

కుల ధృవీకరణ పత్రాలపై సీఎం జగన్‌ ఫోటో లేకుండా చర్యలు తీసుకోవాలి : నిమ్మగడ్డ
ఎస్‌ఈసీ, ప్రభుత్వం మధ్య లేఖల పరంపర కొనసాగుతూనే ఉంది.

ఏపీలో పంచాయతీ ఎన్నికలు కాకరేపుతున్నాయి. ఇవాల్టి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. ఎస్‌ఈసీ, ప్రభుత్వం మధ్య లేఖల పరంపర కొనసాగుతూనే ఉంది. కుల ధృవీకరణ పత్రాలపై సీఎం వైఎస్‌ జగన్‌ ఫోటో లేకుండా చర్యలు తీసుకోవాలంటూ సీఎస్‌కు లేఖరాశారు నిమ్మగడ్డ.

మరో లేఖలో ఏకంగా సీఎంవోనూ టార్గెట్ చేశారు. జీఏడీ పొలిటికల్‌ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలంటూ తాజాగా రాసిన లేఖలో సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌కు సూచించారు నిమ్మగడ్డ. ఎస్ఈసీ ఆదేశాలు అమలు కాకుండా ప్రవీణ్ ప్రకాష్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు.


Tags

Next Story