పంచాయతీరాజ్ ప్రధానకార్యదర్శి ద్వివేది, ముఖ్య అధికారులతో భేటీ కానున్న నిమ్మగడ్డ
పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో SEC నిమ్మగడ్డ బిజీ అయిపోయారు. కాసేపట్లో గవర్నర్‌ను కలిసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు SEC కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ప్రధాన కార్యదర్శి ద్వివేది, ముఖ్య అధికారులతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం కానున్నారు. ఎన్నికల షెడ్యూల్, ప్రభుత్వ సహకారంపై చర్చించనున్నారు. అలాగే రేపు షెడ్యూల్ వివరాలు మరోసారి వెల్లడించాలని కూడా ఆయన భావిస్తున్నారు.
మరోవైపు ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలవుతోంది. పలు ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలను వివరించే హోర్డింగ్స్ తొలగించాలని ఆదేశించారు. రాజకీయ నేతల విగ్రహాలు కనిపించకుండా కవర్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. సంక్షేమ పథకాల పంపిణీలో ప్రజాప్రతినిధులు పాల్గొనకూడదని, నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com