మాజీ సీఎం వైఎస్సార్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది : ఎస్‌ఈసీ నిమ్మగడ్డ

పంచాయతీ ఎన్నికలను ఏ శక్తి అడ్డుకోలేదన్నారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్. హైకోర్డు డివిజన్ బెంచ్, సుప్రీంకోర్టు ధర్మాసనం ఎన్నికల జరపాల్సిందేనని ఆదేశించాయని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా కొంతమంది తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా... ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో జరపాలన్నదే తన సంకల్పమన్నారు నిమ్మగడ్డ రమేష్‌కుమార్.
దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని గుర్తు చేసుకున్నారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్. వైఎస్ అంటే తనకు ప్రత్యేక గౌరవముందన్నారు. వైఎస్ హయంలోనే ఆర్ధిక శాఖ కార్యదర్శిగా పనిచేసినట్లు చెప్పారాయన. దివంగంత నేత వైఎస్‌లో లౌకక దృక్పథం ఉండేదని, తనపై వైఎస్ ఉంచిన నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయలేదన్నారు నిమ్మగడ్డ.
సీబీఐ కేసు విచారణలపైనా మాట్లాడారు నిమ్మగడ్డ రమేష్‌కుమార్. ఇటీవల జరిగిన కొన్నిపరిణామాల్లో తానే ప్రత్యక్ష సాక్షినని, నిజాలు చెప్పడమే తన నైజమని... ఎవరికీ భయపడే ప్రసక్తే లేదన్నారు నిమ్మగడ్డ.
పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలను సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు నిమ్మగడ్డ. వీటిపై షాడో బృందాలు దృష్టిపెడాయని హెచ్చరించారు. 2006లో 36 శాతమే ఏకగ్రీవాలయ్యాయని, ఆ తర్వాత తగ్గుముఖఘం పట్టాయన్నారు.వెనకబడినవారిని ప్రోత్సహించడమే సమన్యాయమన్నారు నిమ్మగడ్డ. దేశవ్యాప్తంగా జరిగే అన్ని ఎన్నికల్లోనూ పోటీ ఉండాలన్నదే రాజ్యాంగం చెబుతోందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com