బిగ్ బ్రేకింగ్.. ఏపీ పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి , కమిషనర్‌పై బదిలీ వేటు

సుప్రీం కోర్టు తీర్పుతో దూకుడు పెంచిన sec నిమ్మగడ్డ
సహాయ నిరాకరణ చేసిన అధికారులపై బదిలీల వేటు
పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది.. కమిషనర్ గిరిజా శంకర్ బదిలీ
గతంలో sec ఇచ్చిన ఆదేశాలను అమలు చేసిన ప్రభుత్వం
ఆ స్థానాల్లో ముగ్గురు పేర్లు సూచించిన sec
మూడు పేర్లతో ప్రతిపాదిత జాబితా పంపిన ప్రభుత్వం
చిత్తూరు, గుంటూరు కలెక్టర్లను ఎన్నికలకు దూరం పెట్టమని గతంలో సూచించిన sec
కలెక్టర్లపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదానిపై ఉత్కంఠ
సుప్రీం కోర్టు తీర్పుతో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు పెంచారు. సహాయ నిరాకరణ చేసిన అధికారులపై బదిలీ వేటు పడింది. పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది.. కమిషనర్ గిరిజా శంకర్ బదిలీ వేటు వేస్తు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
గతంలో ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను ఎట్టకేలకు ప్రభుత్వం పాటించింది. అందులో భాగంగా ఇద్దరు అధికారులపై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. ఆ స్థానంలో ముగ్గురు పేర్లను సూచించిన మూడు పేర్లతో ప్రతిపాదిత జాబితా పంపింది.
ఇద్దరు ఉన్నతాధికారులపై వేటు పడడంతో ఇప్పుడు గుంటూరు, చిత్తూరు కలెక్టర్ పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. గతంలో ఇద్దర్నీ ఎన్నికలకు దూరంగా పెట్టాలని ఎస్ఈసీ ఆదేశించింది. దీంతో వారిపైనా వేటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com