రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి మరోసారి లేఖ రాసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్

రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి మరోసారి లేఖ రాసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్
X

ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సహకరించాలంటూ ఏపీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ మరోసారి లేఖ రాశారు. సీఎస్‌తో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌కు కూడా ఆయన లేఖ రాశారు. ఈ లేఖలో కోర్టు ఆదేశాలను ప్రస్తావించారు. 2021 ఓటర్ల సవరణ ప్రక్రియను జనవరి నాటికి పూర్తి చేయాలని సూచించారు. నవంబర్‌ 23న కూడా స్థానిక ఎన్నికలకు సహకరించాలని సీఎస్‌కు నిమ్మగడ్డ లేఖ రాశారు.

Tags

Next Story