అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై సికింద్రాబాద్ కోర్టు విచారణ!

బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్టైన అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై సికింద్రాబాద్ కోర్టు విచారణ జరిగింది. బెయిల్ మంజూరు చేయాలని అఖిలప్రియ తరపు న్యాయవాది కోర్టును కోరారు. నిన్న A-2 గా ఉన్న అఖిల ప్రియను ఇవాళ A-1 గా చేర్చారని.. 41 సీఆర్పీసీ కింద ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం అఖిలప్రియ ఆరోగ్యం బాగాలేదని, ఆమెకు గైనిక్ ట్రీట్‌మెంట్ జరుగుతోందన్నారు.
అక్టోబర్ నుంచి PCOD చికిత్స పొందుతుందని తెలిపారు. జైల్లో సరైన సదుపాయలు లేవని, బెయిల్ మంజూరు చేయాలన్నారు. ఆమెను వైద్య చికిత్స కోసం ప్రభుత్వ, లేదా ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. అఖిలప్రియ ఆరోగ్య పరీక్షల నివేదికలను పరిశీలించిన న్యాయమూర్తి .. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశించారు. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేశారు.
ప్రస్తుతం అఖిలప్రియ చంచల్‌గూడ మహిళా జైలులో అధికారులు అబ్జర్వేషన్‌లో ఉంచారు. అయితే రాత్రి జైలుకు తీసుకువచ్చినప్పట్నుంచి అఖిలప్రియ ఏమీ తినలేదని.. కొంత అనారోగ్యంగా ఉందని తెలిపారు. ఉదయం లేచిన తర్వాత ఆమె జ్యూస్ మాత్రమే తాగారని జైలు అధికారులు చెప్పారు. చంచల్ గూడ జైలులో అఖిల ప్రియకు యూటీ 1509 నెంబర్‌ను అధికారులు కేటాయించారు. అఖిల ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో జైలు ఆసుపత్రిలోనే వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.
ఆమెకు ఎలాంటి స్పెషల్ కేటగిరి కేటాయించలేదు. కరోనా నిబంధనలు నేపథ్యంలో సింగిల్ బ్యారక్‌లో అఖిల ప్రియ ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ఇంకా పరారీలోనే ఉన్నారు. భార్గవ్ రామ్ ఆచూకీ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నారు. A1 గా ఉన్న ఏవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు... విచారణ అనంతరం 41 సీఆర్పీ నోటీసు ఇచ్చి వదిలేశారు. కిడ్నాప్ చేసిన నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు ఇంకా చూపించలేదు. హఫీజ్‌పేట్‌లోని భూ వివాదమే ఈ కిడ్నాప్‌కు కారణమని పోలీసులు తేల్చిచెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com