AP: పవన్ టూర్ లో నకిలీ ఐపీఎస్.. తీవ్ర కలకలం

పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో భద్రతా లోపం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఐపీఎస్ యూనిఫారంతో వచ్చిన సూర్య ప్రకాష్ అనే వ్యక్తిని విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడ్ని విజయనగరం జిల్లా ముడిదాం ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. కాగా, గత ఏడాదే ఐపీఎస్ కు సెలక్ట్ అయ్యానని స్థానికులకు చెప్పిన సూర్యప్రకాస్.. ట్రైనింగ్ లో ఉండి పవన్ కళ్యాణ్ పర్యటన కోసం వచ్చానని చెప్పాడు.
అరెస్ట్ చేసిన పోలీసులు
తన సొంత కార్ ఇంటి దగ్గరే విడిచి పెట్టి వేరే కార్లో విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నించిన సూర్య ప్రకాష్ ను.. విజయనగరం సరిహద్దులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, సూర్య ప్రకాష్ ఎస్కేప్ అయ్యేందుకు స్థానిక ఏఆర్ కానిస్టేబుల్ సహకరించాడు. తన వాహనాన్ని కూడా ఆ కానిస్టేబుల్ ఇంటి దగ్గరే విడిచి పెట్టిన సూర్య ప్రకాష్.. అతడు ఇంతకు ఐపీఎస్ అధికారా కాదా అనే వివరాలను విజయనగరం పోలీసులు సేకరిస్తున్నారు. ఇక, సూర్య ప్రకాష్ గతంలో పార్వతీపురం డివిజన్ తూనుకలు కొలతలు విభాగంలో లైసెన్స్డ్ రిపేరర్ గా పని చేశాడు.
స్పందించిన హోంమంత్రి
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో భద్రతా లోపంపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. వై కేటగిరీ భద్రతలో ఉన్న పవన్ కల్యాణ్ చుట్టూ నకిలీ ఐపీఎస్ తిరగడంపై విచారణకు ఆదేశించారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని హోంమంత్రి ఆదేశించారు. డిప్యూటీ సీఎం పర్యటనలో అసలు భద్రతా లోపం ఎలా తలెత్తిందని ఉన్నతాధికారులను హోంమంత్రి ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com