YCP leader Subbarao Gupta: సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత సుబ్బారావు గుప్తా

Subbarao Gupta: సొంత పార్టీ నేతలను విమర్శించిన పాపానికి దాడికి గురైన వైసీపీ నేత సుబ్బారావు గుప్తా మరోసారి సంచలన కామెంట్స్ చేశారు.. మధ్యాహ్నం వంగవీటి రాధాను కలిసినట్లు చెప్పిన సుబ్బారావు గుప్తా.. వైసీపీ నేతలకు సూటిగా తగిలేలా వాగ్బాణాలు సంధించారు.. రెక్కీ జరిగిందనే వంగవీటి రాధాను కలిశానని చెప్పారు.. తనపై ఏకంగా దాడే జరిగిందన్నారు.
తనకు వంగవీటి రంగా అంటే ప్రాణమని చెప్పుకొచ్చారు.. ఆయన బ్రతికి ఉంటే ముఖ్యమంత్రి అయ్యుండేవారని అన్నారు.. దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. తనపై, తన ఇంటిపై దాడి విషయాన్ని కార్ నంబరుతో సహా పోలీసులకు చెప్పానన్నారు..
తనకు మతిస్థిమితం లేదని 151 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో ఒక్కరితోనైనా చెప్పించాలని సవాల్ విసిరారు. తాను ఎవరికీ భయపడబోరని.. ఆర్యవైశ్యులకు దమ్ముదంటూ కామెంట్స్ చేశారు.. తను మాత్రం తగ్గేదే లేదంటున్నారు వైసీపీ నేత సుబ్బారావు గుప్తా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com