రాజధాని రైతులకు హైకోర్టు బెయిల్

రాజధాని రైతులకు హైకోర్టు బెయిల్

అమరావతి పరిధిలోని మంగళగిరి మండలం కృష్టాయపాలెంకు చెందిన ఏడుగురు రాజధాని రైతులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు రైతులను నేడు జైలు నుంచి విడుదల చేసే అవకాశం ఉంది. హైకోర్టులో రైతుల తరఫున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ వాదనలు వినిపించారు. కృష్ణాయపాలెం గ్రామ వాసి ఈపూరి రవి రైతులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏడుగురు రైతులపై పోలీసులు కేసు పెట్టారు. వారిని అరెస్టు చేసి చేతులకు బేడీలు వేశారు. అయితే రైతులకు బేడీలు వేయడంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడంపైనా చర్చ జరిగింది. అయితే రైతుల్లో ఐదుగురు ఎస్సీ వర్గానికి చెందిన వారు కాగా... మిగిలిన ఇద్దరిలో ఒకరు యాదవ, మరొకరు గౌడ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. వీరిద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. తగిన విచారణ జరిపిన తర్వాతే... కులం పేరిట దూషించారని ప్రాథమికంగా నిర్ధారించుకున్నాకే ఈ కేసులో అరెస్టు చేయాలి. కానీ ఎలాంటి విచారణ చేయకుండా రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే రవి ఇచ్చిన ఫిర్యాదులో కులం పేరిట దూషించారనే ప్రస్తావనే లేదు. అక్కడ ఎలాంటి గొడవలు, అల్లర్లూ, హింసాత్మక ఘటనలూ చోటుచేసుకోలేదు. అయినా సరే... రైతులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వాదనలు పూర్తిగా విన్న హైకోర్టు కృష్ణాయపాలెం రైతులకు బెయిల్‌ మంజూరు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story