ఛీ.. దరిద్రుడు.. 7వ తరగతి విద్యార్ధినిపై 65 ఏళ్ల వృద్ధుడు..

ఆడపిల్లకు రక్షణ లేదు. అడుగడుగునా భయం. కాటికి కాళ్లు చాపుకున్న ముసలాడు కూడా ఆడపిల్లను చూడగానే మెలికలు తిరిగిపోతున్నాడు. కామవాంఛతో రగిలిపోతున్నాడు. అభం శుభం తెలియని చిన్నారులను తమ కామవాంఛలకు బలి చేస్తున్నారు. తాజాగా మనవరాలి వయసున్న ఓ చిన్నారిపై 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేశాడు.
అనంతపురం జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. 7వ తరగతి విద్యార్ధినిపై 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన కదిరి రూరల్ మండలం పట్నంలో జరిగింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ విద్యార్ధినిని చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వావి వరుసలు, వయసు తారతమ్యాలు మరిచి క్రూరంగా ప్రవర్తిస్తున్న ఇటువంటి వారికి కఠిన శిక్షలు పడితే తప్ప సమాజం మారదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com