YS Vivekananda Reddy: వివేకా కేసులో సీబీఐ ముందు సంచలన నిజాలు..

YS Vivekananda Reddy: వివేకా కేసులో సీబీఐ ముందు సంచలన నిజాలు..
X
YS Vivekananda Reddy: గుండెపోటుకీ, గొడ్డలిపోటుకీ మధ్య ఏం జరిగిందో క్లారిటీ వస్తోంది.

YS Vivekananda Reddy: గుండెపోటుకీ, గొడ్డలిపోటుకీ మధ్య ఏం జరిగిందో క్లారిటీ వస్తోంది.CBI ముందు వాంగ్మూలం ఇస్తున్న వాళ్లంతా చెప్తోంది ఒకటే. YS వివేకా కేసులో కావాలనే కొందరు గొడ్డలిపోటును గుండెపోటుగా ప్రచారం చేశారు. వాళ్లు ఎందుకలా చేశారు..? హత్య విషయం తెలిసి స్పాట్‌కి వచ్చిన వాళ్లను కూడా ఎందుకు బెదిరించారు..? వీటన్నింటిపైన కూపీ లాగుతున్న CBI టీమ్‌.. ఒక్కో ముడి విప్పుతూ ముందుకెళ్తోంది.

అప్రూవర్‌గా మారిన దస్తగిరి స్టేట్‌మెంట్‌, నాడు పులివెందుల CIగా ఉన్న శంకరయ్య వాంగ్మూలం, వాచ్‌మెన్‌ రంగయ్య మేజిస్ట్రేట్‌ ముందు చెప్పిన మాటలు ఇప్పటికే సంచలనంగా మారితే ఇప్పుడు YS కుటుంబంలోకి మరొకరు ఇచ్చిన వాంగ్మూలం కూడా బయటకు వచ్చింది. YS ప్రతాప్‌రెడ్డి 2021 ఆగస్టు 16న CBI విచారణకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు.

ఆయన చెప్పినదాన్ని బట్టి ఆయన వివేకా ఇంటికి వెళ్లేప్పటికే.. YS అవినాష్‌రెడ్డి, YS మనోహర్‌రెడ్డి, YS భాస్కర్‌రెడ్డి, D శంకర్‌రెడ్డి స్పాట్‌లో ఉన్నారు. వాళ్లే అందరికీ వివేకా గుండెపోటుతో చనిపోయినట్టు చెప్పారని ప్రతాప్‌రెడ్డి CBIకి చెప్పారు. గుండెపోటే అయితే బెడ్‌రూమ్‌లోను, బాత్‌రూమ్‌లోను రక్తపు మరకలు ఎందుకు కడిగేస్తున్నారనే అనుమానం అప్పుడే వచ్చిందన్నారు.

భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి వివేకా రూమ్‌లో తిరుగుతున్నప్పుడు తాను చూశానని కూడా వివరించారు. తన కళ్లముందే ఆధారాలు చెపిరేశారని స్పష్టం చేశారు. ఎర్ర గంగిరెడ్డి, ఎంవీ కృష్ణారెడ్డి, డి.శంకర్‌రెడ్డి, ఇనాయతుల్లా కూడా ఆరోజు అక్కడే ఉన్నారని CBIకి చెప్పారు ప్రతాప్‌రెడ్డి. మంచం దగ్గర, బాత్‌రూమ్‌ కమోడ్‌ వద్ద రక్తం ఉండడం తాను చూశానన్నారు. నుదుటిపై గాయం చూస్తే అది గుండెపోటు కాదనే

అనుమానం వచ్చిందన్నారు. అదే సమయంలో ఆధారాల్ని చెరపొద్దని CI చెప్పినా ఎర్ర గంగిరెడ్డి ఆ మాటల్ని పట్టించుకోలేదన్నారు. శంకర్‌రెడ్డితో కలిసి బెడ్‌షీట్లు మార్చడం లాంటివి చేశారని చెప్పారు. పనిమనిషితో రక్తం మొత్తం క్లీన్‌ చేయించారని వివరించారు. అటు, YS ప్రతాప్‌రెడ్డి మరికొన్ని కీలక విషయాలు కూడా CBI ముందు ఉంచారు. ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డికి వివేకాకు మొదట్నుంచి విభేదాలు ఉండేవని చెప్పారు.

2017లో MLC ఎన్నికల్లో తన ఓటమికి కారకుల్లో అవినాష్‌రెడ్డి, డి.శంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి కీలకమని వివేకా చెప్పేవారన్నారు. CBI విచారణలో ఇనాయనతుల్లా కూడా కీలక సమాచారం బయటపెట్టినట్టు తెలుస్తోంది. వివేకా సహాయకుల్లో ఒకరైన ఇనాయతుల్లా ఈ హత్య విషయంపై తనకు ముందుగా ఎవరు ఫోన్‌ చేసి చెప్పారు, స్పాట్‌లో తాను ఏం గమనించాడో అన్నింటిపైన ఓపెన్‌ అయిపోయాడు.

రక్తం మరకలు తుడిచేయాలని అక్కడున్నవారు పనిమనిషిపై ఒత్తిడి తేవడంతో తానే వెళ్లి బకెట్‌తో నీళ్లు తెచ్చానన్నారు. పనిమనిషి లక్షమ్మ రక్తం తుడిచేసిందన్నారు. CI శంకరయ్య కూడా డెడ్‌బాడీని బాత్‌రూమ్‌ నుంచి బయటకు తెస్తున్నప్పుడు అక్కడే ఉన్నారన్నారు. ఆ సమయంలో ఫొటోలు తీసేందుకు ఫొటోలు తీసేందుకు ప్రయత్నించిన వాళ్లను గంగిరెడ్డి బెదిరించాడన్నారు.

పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సునీల్‌ యాదవ్‌ కూడా ఆరోజు స్పాట్‌లో ఉండడం తాను గమనించానన్నారు. ఇలా ఎవరు వాంగ్మూలం ఇస్తున్నా ఆ రోజు ఉదయం ఇంటి వద్దకు ముందుగా ఎవరు వెళ్లారు, జరిగిన హత్యను గుండెపోటుగా ఎవరు చెప్పమన్నారు అదే దానిపై వారికి తెలిసిన సమాచారం CBIకి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా కేసు కొలిక్కి వచ్చేట్టు కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. నాటి పులివెందుల CI శంకరయ్యను CBI నిన్న మరోసారి ప్రశ్నించినట్టు వార్తలు వస్తున్నాయి. CBI DIG చౌరాసియానే స్వయంగా సీఐను విచారించారినట్టు సమాచారం. 2020 జులైలో ఒకసారి, 2021 సెప్టెంబర్‌ నెలలో ఓసారి సీబీఐ అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పిన శంకరయ్య.. ఇప్పుడు మళ్లీ దర్యాప్తు ఎదుర్కొన్నారు. దర్యాప్తుకు సంబంధించిన కొన్ని అంశాల్లో క్లారిటీ కోసమే ఆయన్ను పిలిపించినట్టు ప్రచారం జరుగుతోంది.

Tags

Next Story