తిరుపతిలో జవాన్ టీమ్.. శ్రీవారిని దర్శించుకున్న షారుఖ్

తిరుపతిలో జవాన్ టీమ్.. శ్రీవారిని దర్శించుకున్న షారుఖ్
కూతురు సుహానా, జవాన్ కో-స్టార్ నయనతారతో కలిసి షారూక్ ఖాన్ తిరుపతి శ్రీవారిని సందర్శించారు.

కూతురు సుహానా, జవాన్ కో-స్టార్ నయనతారతో కలిసి షారూక్ ఖాన్ తిరుపతి శ్రీవారిని సందర్శించారు. షారుఖ్‌తో పాటు కూతురు సుహానా, అతని మేనేజర్ పూజా దద్లానీ ఉన్నారు. సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తన రాబోయే చిత్రం జవాన్ విడుదలకు ముందు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రార్థనలు చేశారు. షారుఖ్ సంప్రదాయ దుస్తులు ధరించి శ్రీవారి ఆలయంలోకి అడుగు పెట్టారు.

కూతురు సుహానా కూడా తెల్లటి వస్త్రాలు ధరించి ఆకట్టుకున్నారు. జవాన్ సహనటి నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్‌ కూడా తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని సందర్శించారు. సెప్టెంబర్ 7న థియేటర్లలో సందడి చేయబోతున్న జవాన్ విడుదలకు కొద్ది రోజుల ముందు షారుఖ్ ఆలయాన్ని సందర్శించారు.కొన్ని వారాల క్రితం, SRK వైష్ణో దేవిని సందర్శించారు. గత వారం ఈ సినిమా ఆడియో లాంచ్ కోసం చెన్నైకి వెళ్లారు. ఆ తర్వాత సినిమా ప్రమోషన్స్ కోసం దుబాయ్ వెళ్లారు.

జవాన్‌తో పాటు , షారుఖ్ ఖాన్ రాజ్‌కుమార్ హిరానీ యొక్క డుంకీలో తాప్సీ పన్నుతో కలిసి నటించారు. ఇది కూడా ఈ సంవత్సరం విడుదల కానుంది. దాదాపు 4 సంవత్సరాల పాటు పెద్ద స్క్రీన్ నుండి దూరంగా ఉన్న షారుఖ్ ఖాన్ 2023 లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అతడికి ఈ సంవత్సరం పఠాన్‌ చిత్రం మంచి హిట్ ఇచ్చింది. దీపికా పదుకొణె, జాన్ అబ్రహంతో కలిసి నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. భారీ బడ్జెట్ తో తీసిన జవాన్ కూడా మంచి హిట్ అందిస్తుందని ఆశతో ఉన్నాడు షారుఖ్. అటు నయన్ కి కూడా ఇదే మొదటి బాలీవుడ్ చిత్రం కావడంతో చాలా ఆశలు పెట్టుకుంది.

Tags

Read MoreRead Less
Next Story