Home
 / 
ఆంధ్రప్రదేశ్ / జగన్ పాలనలో దోషులు బయట...

జగన్ పాలనలో దోషులు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు : ఫారుఖ్‌ షుబ్లీ

జగన్ పాలనలో దోషులు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు : ఫారుఖ్‌ షుబ్లీ
X

జగన్ పాలనలో దోషులు బయట స్వేచ్ఛగా తిరుగుతుంటే... బాధితులు బలైపోతున్నారని సలాం న్యాయపోరాట సమితి కన్వీనర్ ఫారుఖ్‌ షుబ్లీ విమర్శించారు. సలాంపై అంశం అసెంబ్లీలో చర్చించాలనే డిమాండ్‌తో 'చలో అసెంబ్లీ' కి పిలుపునిచ్చామని అన్నారు. సలాం కేసును సీబీఐకి అప్పగించే వరకు పోరాటం ఆగదని స్పష్టంచేశారు. జగన్ ప్రభుత్వంలో మైనారిటీలు, దళితులకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా జగన్ సర్కార్ లాంటి దుర్మార్గపు పాలన జరగడం లేదని విమర్శలు గుప్పించారు.

  • By kasi
  • 3 Dec 2020 8:42 AM GMT
Next Story