SHARMILA: వైఎస్సార్ కొడుకు అయి ఉండి ఇలా చేస్తావా: షర్మిల

వైఎస్సార్సీపీ సెక్యులర్ ముసుగులో మైనార్టీలను మోసం చేస్తోందని షర్మిల ఆరోపించారు. జగన్ బీజేపీకి దత్తపుత్రుడని, ముస్లిం వ్యతిరేక బిల్లులకు మద్దతు ఇవ్వడం దారుణమని అన్నారు. టీడీపీ, జనసేన బహిరంగంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, జగన్ మాత్రం రహస్యంగా పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. మైనారిటీలకు కాంగ్రెస్ మాత్రమే రక్షణ కల్పిస్తుందని ఆమె స్పష్టం చేశారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ మైనారిటీల ద్రోహులేనని షర్మిల దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన మైనారిటీ హక్కులపై పోరాడాల్సిన అంశాలపై దిశా- నిర్దేశం చేశారు. ఈ సమావేశం తర్వాత షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. "వైఎస్సార్ కొడుకు అయ్యి ఉండి ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న బిల్లులకు మద్దతు ఇవ్వడం దారుణం. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీలు మైనారిటీలను ఉద్ధరించింది శూన్యం. గత 10 ఏళ్లుగా ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. జగన్ బీజేపీ దత్తపుత్రుడు." అని షర్మిల మండిపడ్డారు.
వివేకా కేసుపై సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసుపై వైఎస్ సునీత చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉందని షర్మిల కామెంట్ చేశారు. వివేకా హత్య జరిగినప్పటి నుంచి పోరాడుతున్నా వైఎస్ సునీతకు ఇంతవరకూ న్యాయం జరగలేదని అన్నారు. వివేకా హత్య కేసు దర్యాప్తు మళ్లీ జరిగితే అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. సునీత పోరాటంలో న్యాయం ఉందని కూడా షర్మిల కామెంట్ చేశారు. వివేకా హత్య విషయంలో మళ్లీ దర్యాప్తు ఎందుకు చేపట్టవద్దని ప్రశ్నించారు. వై నాట్? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒకటే పోరాటం అని.. ఇంత వరకు న్యాయం జరుగలేదన్నారు. సునీత పోరాటంలో న్యాయం ఉందన్నారు. జగన్ మోదీకి దత్తపుత్రుడు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. మోదీ చేతిలో సీబీఐ కీలు బొమ్మ అని.. జగన్ కోసం మోదీ సీబీఐ గొంతు నొక్కారని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com