SHIVAJI: విమర్శల సుడిగుండంలో నటుడు శివాజీ

తెలుగు చిత్ర పరిశ్రమలో మరోసారి వివాదం చెలరేగింది. నటుడు శివాజీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన మాటలు మహిళలను కించపరిచేలా ఉన్నాయన్న ఆరోపణలతో సోషల్ మీడియా నుంచి రాజకీయ వేదికల వరకు విమర్శల వెల్లువ కొనసాగుతోంది. ముఖ్యంగా టాలీవుడ్‌కు చెందిన పలువురు నటులు, సినీ ప్రముఖులు ఈ వ్యాఖ్యలను బహిరంగంగా ఖండిస్తున్నారు. సినిమా రంగం సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమమని, బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని ప్రముఖులు స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లోనే కాకుండా ప్రజా వేదికలపై కూడా విస్తృత చర్చకు దారితీసింది.
నాపై కుట్ర జరుగుతోంది: శివాజీ
హీరోయిన్లపై అసభ్య పదజాలంతో సంచలన వ్యాఖ్యలు చేసిన శివాజీ అందుకు తగిన పరిణామాలు ఎదుర్కొంటున్నాడు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యాడు. తన సమాధానం చెప్పుకొన్నాడు. ఆ తర్వాత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనపై కుట్ర చేశారన్నాడు. మరోవైపు శివాజీపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ‘‘ఇండస్ట్రీలో జరిగిన ఘటన కారణంగానే అలాంటి కామెంట్లు చేశా. అయితే అందులో తప్పుడు పదాలు దొర్లాయి. అది అంగీకరించా. దీనిపై ఇప్పటికే క్షమాపణ చెప్పినట్లు మహిళా కమిషన్ కు తెలియజేశా. ఇండస్ట్రీలో కొంతమందికి నాపై వ్యతిరేకత ఉంది. అందుకే కుట్ర చేశారు’’ అని శివాజీ అన్నాడు. ఇకపై మహిళల విషయంలో చులకనగా మాట్లాడబోనని కమిషన్ కు శివాజీ తెలిపారు.
తప్పు ఎవరు చేసినా తప్పే :ప్రకాష్‌రాజ్
ఐబొమ్మ రవి ఇష్యూపై నడుటు ప్రకాష్ రాజ్ స్పందించారు. దొంగతనం ఎవరు చేసినా తప్పే కదా అని ప్రశ్నించారు. సినిమా టికెట్ ధర ఎక్కువ అనిపిస్తే సినిమాలు చూడకపోతే సరిపోతుందన్నారు. అంతేకానీ, దొంగతనం చేసే వాడు హీరో ఎలా అవుతాడని ప్రశ్నించారు. ఒక పెద్ద దొంగే ఈ దేశానికి మహాప్రభు అయ్యాడని, అందరూ దొంగనే.. సమర్థిస్తే ఎలా అని క్వశ్చన్ చేశారు. శివాజీ వ్యాఖ్యలపైనా ప్రకాశ్ రాజ్ స్పందించాడు. అనసూయకు మద్దతుగా ప్రకాశ్ రాజ్ పోస్ట్ చేయగా.. దాన్ని అనసూయ రీ పోస్ట్ చేసింది.
శివాజీని రేపిస్టుతో పోల్చిన ఆర్జీవీ
దండోరా మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్ గురించి చేసిన వ్యాఖ్యలపై RGV ఘాటుగా స్పందించాడు. "ఏయ్ శివాజీ.. నీ ఇంట్లోని మహిళలు నీలాంటి అనాగరిక, మురికి మనస్తత్వం ఉన్న వాడిని భరించడానికి సిద్ధంగా ఉంటే, వారికి నీ నీతులు చెప్పుకో, వారిపై మోరల్ పోలీసింగ్ చేసుకో" అని వ్యాఖ్యానించారు. తాజాగా శివాజీని నిర్భయ రేపిస్ట్‌తో పోల్చుతూ వీడియో షేర్ చేశాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. శివాజీపై ముప్పేటా దాడి జరుగుతోంది.
ఆడపిల్లల జోలికొస్తే చెప్పుతో కొట్టండి: నాగబాబు
మహిళల వస్త్రాదరణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై జనసేన నేత, నటుడు నాగబాబు స్పందించారు. శివాజీ తన టార్గెట్ కాదని కానీ మన సమాజంలో మోరల్ పోలీసింగ్ అనే సామాజిక రుగ్మత ఉందన్నారు. మగ అహంకారంతో ఉన్న మన సొసైటీ ఆడపిల్లలు ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనే విషయాలు మాట్లాడుతున్నారని అన్నారు. ఆడపిల్లల గురించి మాట్లాడటానికి మీకు ఏం హక్కు ఉందని ప్రశ్నించారు. కొందరు మహిళలు కూడా దీనికి మద్దతు ఇస్తున్నారని అది వాళ్ల మనసులో నుండి వచ్చింది కాదన్నారు. ప్రపంచంలో ఫ్యాషన్ మారుతుందని వాళ్లు ఎలాగైనా ఉండొచ్చన్నారు. ఆడపిల్ల కాబట్టి ఇలానే ఉండాలని అనుకోవడం తప్పన్నారు. ఒకప్పుడు తాను కూడా ఆడపిల్ల అంటే ఇలానే ఉండాలని అనుకునేవాడినని కానీ దాని నుండి బయటకు వచ్చానని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు వాళ్ల వస్త్రదారణ వల్ల కాకుండా మగావారి రాక్షసత్వం వల్లనే జరుగుతున్నాయని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

