ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల తీరుతెన్నులపై విస్మయపరిచే లెక్కలు

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల తీరుతెన్నులపై విస్మయపరిచే లెక్కలు

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల తీరుతెన్నులపై విస్మయపరిచే లెక్కలనువెల్లడించింది జాతీయ నేర గణాంకాల నివేదిక. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ పోలీసులపై గత ఏడాది పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. భారత దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలీసులపై 4 వేల 608 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క ఏపీ పోలీసులపైనే ఏకంగా 16 వందల 81 కేసులు ఉన్నట్లు నివేదిక బయటపెట్టింది. మహారాష్ట్రలో పోలీసులపై 403, ఉత్తరప్రదేశ్ లో 161 కేసులు నమోదయ్యాయి.

ఏపీ రాష్ట్ర పోలీసులపై నమోదైన 16 వేల 81 కేసుల్లో 302 కేసులకు సంబంధించి దర్యాప్తు పూర్తి చేసి కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసినట్లు NCRBకి వెల్లడించింది పోలీసుశాఖ . మరికొన్ని కేసుల్లో విచారణకు ముందే ఫిర్యాదులు ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. పోలీసులపై వరకట్నం వేధింపుల నుంచి లాకప్ డెత్ ల వరకు పలు కేసులున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story