SIT: కల్తీ నెయ్యి కేసులో వైవీ సుబ్బారెడ్డిపై ప్రశ్నల వర్షం

షరతులు ఎందుకు మార్చారంటూ సిట్ ప్రశ్నలు

తి­రు­మల శ్రీ­వా­రి లడ్డూ ప్ర­సా­దా­ని­కి వి­ని­యో­గిం­చే నె­య్యి కాం­ట్రా­క్టు­లు ఎవ­రె­వ­రి సి­ఫా­ర­సు మే­ర­కు కు­ది­రా­యి? కొం­ద­రి­కి అను­కూ­లం­గా ఉం­డే­లా షర­తు­లు మా­ర్చ­డం­లో అప్ప­టి టీ­టీ­డీ చై­ర్మ­న్‌­గా మీ పా­త్ర ఏమి­టి? మై­సూ­ర్‌­లో­ని ప్ర­యో­గ­శాల నా­ణ్యత రి­పో­ర్టు­లు ఇచ్చిన తర్వాత కూడా భోలే బాబా సం­స్థ నుం­చి నె­య్యి సర­ఫ­రా ఎం­దు­కు కొ­న­సా­గిం­చా­రు? అంత భా­రీ­స్థా­యి­లో నె­య్యి సే­క­ర­ణ­కు సం­బం­ధిం­చిన ఫై­ళ్ల­ను మీ పీఏ అప్ప­న్న ఎం­దు­కు చూ­శా­రు? అంత అధి­కా­రం మీ­రెం­దు­కు ఇచ్చా­రు? వే­ల­ల్లో జీతం తీ­సు­కు­నే ఆయ­న­కు కో­ట్ల రూ­పా­యల ఆస్తు­లు ఎలా వచ్చా­యి?.... అంటూ వై­ఎ­స్‌ జగ­న్‌ బా­బా­య్‌, టీ­టీ­డీ మాజీ చై­ర్మ­న్‌, వై­సీ­పీ రా­జ్య­సభ సభ్యు­డు వైవీ సు­బ్బా­రె­డ్డి­పై ప్ర­త్యేక దర్యా­ప్తు బృం­దం (సి­ట్‌) అధి­కా­రు­లు ప్ర­శ్నల వర్షం కు­రి­పిం­చా­రు. కల్తీ నె­య్యి కే­సు­లో దర్యా­ప్తు కోసం సు­ప్రీం­కో­ర్టు ఏర్పా­టు చే­సిన సి­ట్‌ అధి­కా­రు­లు గు­రు­వా­రం హై­ద­రా­బా­ద్‌­లో వైవీ సు­బ్బా­రె­డ్డి ని­వా­సం­లో­నే ఆయ­న­ను ప్ర­శ్నిం­చా­రు. సు­మా­రు ఏడు­గం­ట­ల­పా­టు ఈ వి­చా­రణ ప్ర­క్రియ జరి­గిం­ది. ఈ కే­సు­లో 24మం­ది­పై కేసు నమో­దు చే­సిన ‘సి­ట్‌’ వైవీ సు­బ్బా­రె­డ్డి వ్య­క్తి­గత సహా­య­కు­డు చి­న్న అప్ప­న్న సహా తొ­మ్మి­ది మం­ది­ని అరె­స్టు చే­సిం­ది. టీ­టీ­డీ మాజీ ఇన్‌­చా­ర్జి ఈవో ధర్మా­రె­డ్డి­తో­పా­టు చి­న్న అప్ప­న్న ఇచ్చిన వాం­గ్మూ­లం ఆధా­రం­గా వై­వీ­ని ప్ర­శ్నిం­చా­రు.

పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించి ప్రసాదాన్ని అపవిత్రం చేయడమే కాకుండా భక్తుల మనోభావాలు, విశ్వాసాన్ని దెబ్బతీయడంతో పాటు స్వామివారికి అపకీర్తిని తెచ్చేందుకు కారణమయ్యారు గత పాలకులు. దీనిపై నమోదైన కేసులో సిట్ వాస్తవాల్ని బయటకు రాబట్టే పనిలో ఉంది. కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న, మాజీ ఈవో ధర్మారెడ్డితో పాటు పలువుర్ని విచారించిన సిట్, ఇప్పుడు వాటిని ఆధారంగా చేసుకుని వైవీ సుబ్బారెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించినట్లుగా తెలుస్తోంది.మాజీ చైర్మన్ సిట్ విచారణకు హాజరుకాలేనని చెప్పడంతో వైవీ సుబ్బారెడ్డి ఇంట్లోనే అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Tags

Next Story