Social Media: సోషల్ మీడియాలో పవన్ సునామీ

తెలంగాణలోని 17 లోకసభ నియోజకవర్గాల్లో బీజేపీ కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతున్నాయి. బీజేపీ ఎనిమిది స్థానాల్లో ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ మరో ఎనిమిది స్థానాల్లో ముందుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో మజ్లిస్ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ముందంజలో కొనసాగుతున్నారు. 8 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, ఖమ్మం నుంచి రఘురామిరెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ ఆధిక్యంలో ఉన్నారు. జహీరాబాద్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, మెదక్, భువనగిరి నియోజకవర్గాల్లోనూ హస్తం పార్టీ హవా సాగుతోంది. బీజేపీ వరంగల్ నుంచి ఆరూరి రమేష్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి గోడం నగేష్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, మహబూబ్నగర్ నుంచి డీకే అరుణ, చేవెళ్ల నుంచి కొండ విశ్వేశ్వర్ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో సత్తా చాటిన బీఆర్ఎస్ కేవలం మెదక్ స్థానంలో ముందంజలో ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com