న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసు సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం

న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసు సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ హైకోర్టు.. 2 నెలల్లో రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది. న్యాయవ్యవస్థపైనా, జడ్జిలపైన సోషల్ మీడియాలో..అభ్యంతరకరమైన పోస్టులు పెట్టిన వారిపై న్యాయస్థానం కొరడా ఝుళిపించింది. కోర్టులపై అనుచిత వ్యాఖ్యల విషయంలో హైకోర్టు గతంలోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం, సీఐడీ తీరుని తప్పుపట్టింది.. ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేస్తే... కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్న అధికారులు... న్యాయవ్యవస్థ విషయంలో ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నేతల వ్యాఖ్యలు చూస్తుంటే.. న్యాయవ్యవస్థపై యుద్ధం ప్రకటించినట్లుగా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. సీఐడీ విచారణపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం విచారణను సీబీఐకి అప్పగించడం సంచలనంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com