పేకాట పాపమ్మలు.. రమ్మీ ఆడుతున్న మహిళల నుంచి రూ.30వేలు స్వాధీనం

మేం ఏమీ తీసిపోం.. ఎందులో తక్కువ కాదు.. వెయ్ ముక్క.. ఎవడొస్తాడో చూస్తా.. అన్నట్టు అక్కడి ఆడవాళ్లంతా పేకాటలో విజృంభిస్తున్నారు. సరదాకి ఆడుతున్నారనుకుంటే పొరపాటు.. డబ్బులతో బెట్టింగులు కూడా కాసేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం పేకాట ఆడుతున్న వారిపై కొరడా ఝళిపించింది. అందులో భాగంగానే జరిగిన రైడ్స్‌లో మహిళలు పట్టుబడడం పోలీసులను విస్మయానికి గురి చేసింది.
పురుషులకంటే తామేమీ తక్కువ కాదని నిరూపించారు విజయనగరానికి చెందిన కొందరు మహిళలు. పేకాట ఆడుతూ పోలీసుల చేతికి చిక్కారు. పక్కా సమాచారంతో విజయనగరం ఉమెన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ నేతృత్వంలో రైడ్ చేసిన పోలీసులు.. రమ్మీ ఆడుతున్న తొమ్మిది మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 30వేల 300 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com