సుప్రీం కోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోరాదు : సోము వీర్రాజు

సుప్రీం కోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోరాదు : సోము వీర్రాజు
జేపీ, జనసేనలు కలిసే పంచాయితీ ఎన్నికల్లో అభ్యర్థులకు మద్దతు ఇస్తామన్నారు సోము వీర్రాజు.

పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలన్న సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో... రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోరాదని.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. గతంలో చరిత్రలో లేని విధంగా ఏకగ్రీవాలు చేశారన్నారు. ఎన్నికల కమిషన్ కూడా వీటి విషయంలో పూర్తి పారదర్శకంగా ఉండేలా చూడాలన్నారు.

నామినేషన్‌లు ఆన్‌లైన్‌ ద్వారా వేసేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు సోము వీర్రాజు. అభ్యర్థులపై దాడులను నియంత్రించే రక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. బీజేపీ, జనసేనలు కలిసే పంచాయితీ ఎన్నికల్లో అభ్యర్థులకు మద్దతు ఇస్తామన్నారు. తిరుపతి ఉపఎన్నికలో రెండు పార్టీల నుంచి ఒకరే అభ్యర్థిలో బరిలో ఉంటారన్నారు.


Tags

Read MoreRead Less
Next Story