RAILS: సంక్రాంతికి మరో 52 అదనపు రైళ్లు

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని అధిగమించేందుకు అదనపు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. నగరంలోని సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళం ప్రాంతాలకు 52 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఆయా ప్రాంతాలకు ఈనెల 6 నుంచి 18వ తేదీ వరకు ఇవి అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నెల 6 నుంచి 18 వరకు ఈ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. చర్లపల్లి-తిరుపతి ప్రత్యేక రైళ్లు (07077, 02764) 6, 8, 11, 15 తేదీల్లో నడవనున్నాయి.. తిరుపతి-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు (07078, 02763) 7, 9, 12, 16 తేదీల్లో నడవనున్నాయి. ఈ నెల 13న వికారాబాద్-కాకినాడ, 14న కాకినాడ-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. కాచిగూడ-తిరుపతి రైళ్లు (07655) 9, 16 తేదీల్లో.. తిరుపతి-కాచిగూడ రైళ్లు (07656) 10, 17 తేదీల్లో నడుస్తాయి.
చర్లపల్లి-నర్సాపూర్ మధ్య...
చర్లపల్లి-నర్సాపూర్ 11, 18 తేదీల్లో, నర్సాపూర్-చర్లపల్లి 12, 19 తేదీల్లో, సికింద్రాబాద్-కాకినాడ 12, 19 తేదీల్లో, కాకినాడ-సికింద్రాబాద్ 12, 19 తేదీల్లో, చర్లపల్లి-నర్సాపూర్ 7, 9, 13, 15, 17 తేదీల్లో, నర్సాపూర్-చర్లపల్లి 8, 10, 14, 16, 18 తేదీల్లో, చర్లపల్లి-కాకినాడ 8, 10, 12, 14 తేదీల్లో, కాకినాడ-చర్లపల్లి 9, 11, 13, 15 తేదీల్లో, నాందేడ్-కాకినాడ 6, 13 తేదీల్లో, కాకినాడ-నాందేడ్ 7, 14 తేదీల్లో, చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్ 9, 12, 14 తేదీల్లో, శ్రీకాకుళం రోడ్-చర్లపల్లి 10, 13, 15 తేదీల్లో, ఈ నెల 7న కాచిగూడ-శ్రీకాకుళం రోడ్, 8న శ్రీకాకుళం రోడ్-కాచిగూడ ప్రత్యేర రైళ్లు నడుస్తాయి.
సంక్రాంతికి తిరుపతి నుంచి ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి నేపథ్యంలో తిరుపతి నుంచి పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. ఈనెల 6 నుంచి 16 మధ్య పలు తేదీల్లో తిరుపతి నుంచి చర్లపల్లి 10, 17వ తేదీల్లో తిరుపతి నుంచి కాచిగూడకు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు
సంక్రాంతి కోసం మొత్తం 122 రైళ్లు..
ఈ ఏడాది సంక్రాంతి కోసం ఇప్పటికే 122 స్పెషల్ రైళ్లను సిద్ధం చేశారు. వాటికి అదనంగా మరో 60 రైళ్లు కూడా నడుపుతున్నారు. అంతేకాదు వీటితో పాటు మరో 90 పాసింగ్ త్రూ రైళ్లను పట్టాలెక్కిస్తున్నారు. ఈ సంక్రాంతికి పెరిగే రద్దీని దృష్టిలో పెట్టుకుని దాదాపు 160 నుంచి 170 రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com