Gorantla Nude Video : అది ఒరిజినల్ వీడియో కాదు.. ఎక్కడి నుంచి అప్లోడ్ అయ్యిందంటే : ఎస్పీ

Gorantla Nude Video : రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపిన గోరంట్ల మాధవ్ న్యూడ్ కాల్ వ్యవహారంలో పోలీసులు ఎట్టకేలకు రియాక్ట్ అయ్యారు.. ఐదు రోజుల తర్వాత ప్రెస్‌మీట్ పెట్టిన అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఈ వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపలేమని చెప్పుకొచ్చారు. ఒరిజినల్ కాదని అందువల్లే దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపలేమని ఎస్పీ చెప్పారు. దాన్ని ఒక ఫోన్ లో నుంచి మరో ఫోన్‌తో రికార్డు చేశారని అందువల్ల ఒరిజినలా కాదా అని నిర్ధారించలేకపోతున్నామని అన్నారు.
యూకే నుంచి ఈ వీడియో పోస్ట్ అయినట్లు గుర్తించామన్నారు.. యూకేలోని వొడోఫాన్‌కు చెందిన నంబరు నుంచి వీడియో కాల్ నడిచినట్లుగా ఉందని.. యూకే నంబరు ట్రేస్ చేసే పనిలో ఉన్నామని చెప్పుకొచ్చారు.. దీనికి సంబంధించి బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదన్న ఎస్పీ ఫకీరప్ప.. వీడియో మార్ఫింగ్ చేశారని ఎంపీ అనుచరులు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
అటు ఎస్పీ ప్రకటనపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు.. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ ఒరిజినల్ కాదంటూ ఎస్పీ ప్రకటించడంపైనా లోకేష్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.. ఒరిజనల్ కాదని ఎస్పీ ఏ ఆధారాలతో చెప్తారని ప్రశ్నించారు.. ఫోరెన్సిక్ ల్యాబ్ వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.. ఇది ఒరిజినల్ కాకపోవచ్చు అంటున్నారంటే ఒరిజినల్ కచ్చితంగా ఉండి ఉంటుంది కదా అంటూ ఎస్పీని స్ట్రయిట్‌గా కొశ్చన్ చేశారు.
ఎంపీ గోరంట్ల న్యూడ్ కాల్ కేసును నీరు గార్చేందుకు కుట్రల చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ ఆరోపించారు. గోరంట్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అందరూ భావించారని... అయితే తాడేపల్లి డైరెక్షన్ మేరకే ఎస్పీ మాట్లాడారని అన్నారు. నిజాలు వెలికి తీయడంలో పోలీసులు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని... ఇక ఫేక్ అని ఎస్పీ ఎలా తేల్చి చెప్తారని బోండా ఉమ ప్రశ్నించారు.
మొత్తానికి ఏపీ రాజకీయం గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోకాల్ చుట్టూ తిరుగుతోంది. గతంలో వైసీపీ నేతలు చేసిన కామెంట్లకు.. ఇప్పుడు ఎస్పీ ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు ఎలాంటి పొంతనా లేదంటున్నారు ప్రతిపక్ష నేతలు.. మరోవైపు ఎస్పీ ప్రెస్ మీట్ తో తనకుక్లీన్ చిట్ ఇచ్చారంటూ ఎంపీ మాధవ్ చెప్పుకోవడం మరింత విడ్డూరంగా ఉందంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com