IARI: భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్‌గా తెలుగోడు

IARI:  భారత వ్యవసాయ పరిశోధన సంస్థ  డైరెక్టర్‌గా తెలుగోడు
X

ప్రతిష్ఠాత్మక భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్‌ఐ) డైరెక్టర్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చెందిన శాస్త్రవేత్త చెరుకుపల్లి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా ఖ్యాతి గడించారు. శ్రీనివాసరావు స్థానంలో నార్మ్ జాయింట్ డైరెక్టర్ గా విధులు నిర్వహించే రామ సుబ్రహ్మణ్యం ఇన్చార్జి డైరెక్టర్ గా కొనసాగనున్నట్లు నార్మ్ ప్రజా సంబంధాల అధికారిణి (PRO) అనీజా గుత్తికొండ ఓ ప్రకటనలో వెల్లడించారు.ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని అనిగండ్లపాడు శ్రీనివాసరావు స్వస్థలం. రైతు కుటుంబంలో జన్మించిన ఆయన అంచలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు.

విద్యాభ్యాసం అక్కడే...

బాపట్ల వ్యవసాయ కళాశాలలో 1982-86లో ఏజీ బీఎస్సీ, 1986-88 వరకు పీజీ చదివారు. భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో పీహెచ్‌డీ చేశారు. 1992లో శాస్త్రవేత్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలిలో మూడు దశాబ్దాలుగా వివిధ హోదాల్లో పని చేస్తూ ఈ స్థాయికి ఎదిగారు. విశిష్ట పరిశోధనలు చేసి అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ భూవిజ్ఞాన శాస్త్రవేత్తగా పేరు గడించారు. వాతావరణ మార్పులపై అంతర్జాతీయ స్థాయిలో జరిగిన విధాన నిర్ణయ సమావేశాలకు భారత ప్రతినిధిగా ఆయన హాజరయ్యారు. 300కు పైగా పరిశోధన పత్రాలు సమర్పించగా, అంతర్జాతీయ, జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.

Tags

Next Story