- Home
- /
- ఆంధ్రప్రదేశ్
- /
- దేవాదాయ శాఖమంత్రి రాజీనామా చేయాలి :...
దేవాదాయ శాఖమంత్రి రాజీనామా చేయాలి : శ్రీనివాసానంద సరస్వతి స్వామి

By - Nagesh Swarna |10 Sep 2020 7:12 AM GMT
అంతర్వేదిలో దగ్దమైంది స్వామివారి రథం కాదని..5కోట్ల మంది ప్రజల మనోరథాలన్నారు ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామి. రాష్ట్రంలో దేవాలయాల సాంప్రదాయాలు మంటకలుస్తున్నాయని స్వామిజీ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగి ఇన్నిరోజులైనా ప్రభుత్వం నుంచి ఊరటనిచ్చే ప్రకటన రాకపోవడం శోచనీయమన్నారు. ఇంతవరకు నిందితున్ని ఎందుకు పట్టుకోలేక పోయారని స్వామిజీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ దేవాదాయ శాఖమంత్రి పదవి నుంచి తప్పుకోవాలన్నారు.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com