Srisailam: అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు

Srisailam: అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు
X
ఇతర రాష్ట్రాల నుంచి కూడా తండోపతండాలుగా తరలివస్తున్న భక్తులు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. 6వ రోజు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు.. పుష్పపల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు. పురవీధుల్లో విహరించిన స్వామిఅమ్మవార్ల ముందు కళాకారులు సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించా రు. శివనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగిపోతున్నాయి.

Tags

Next Story