శ్రీశైలం రిజర్వాయర్‌కు మళ్లీ వరద.. రెండు లక్షల క్యూసెక్కులకుపైగానే

శ్రీశైలం రిజర్వాయర్‌కు మళ్లీ వరద.. రెండు లక్షల క్యూసెక్కులకుపైగానే

శ్రీశైలం రిజర్వాయర్‌కు మళ్లీ వరద ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే అధికారులు 10 క్రస్ట్‌ గేట్లను 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది శ్రీశైలం డ్యామ్‌ గేట్లను ఎత్తివేయడం ఎనిమిదోసారి కావడం విశేషం. ప్రస్తుతం రిజర్వాయర్‌కు రెండు లక్షల 34 వేల క్యూసెక్కులకుపైగానే ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 884.90 అడుగుల మేర నీరుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం నుంచి సాగర్‌ జలశయానికి 3 లక్షల 45 వేల క్యూసెక్కులకుపైగా వరద వచ్చి చేరుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటం, ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story