రికార్డు స్థాయిలో శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి హుండీ ఆదాయం

రికార్డు స్థాయిలో శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి హుండీ ఆదాయం
స్వామివారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో వచ్చింది.

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో వచ్చింది. స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాల పరివార ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. 35 రోజులకు గాను 3కోట్ల 82లక్షల 23వేల రూపాయల నగదుతో పాటు 153 గ్రాముల బంగారం, 4కేజీల 700 గ్రాముల వెండి, వివిధ దేశాల కరెన్సీని భక్తులు కానుకల రూపంలో స్వామివార్లకు సమర్పించారు. పటిష్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ హుండీ లెక్కింపులో దేవస్థానం అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story