శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే నిర్వహించాలని TTD నిర్ణయించింది. తిరుపతిలోని పరిపాలనా భవనంలో EO జవహర్‌రెడ్డి, ప్రత్యేక కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి, DIG క్రాంతిరాణాటాటా, చిత్తూరు కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా సమావేశమై బ్రహ్మోత్సవాల విషయంపై చర్చించారు. మొదట్లో పరిమిత సంఖ్యలో భక్తుల్ని అనుమతించాలని భావించినా, కోవిడ్ ఉధృతి ఇంకా తీవ్రంగానే ఉన్నందున ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. ఈనెల 16 నుంచి 24వ తేదీ వరకూ జరిగే బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే పూర్తి చేయాలని నిర్ణయించారు.

Tags

Next Story