STAMPADE: "కాశీబుగ్గ" ప్రమాదంపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాట ఘటనలో 10 మంది భక్తులు మృతి చెందగా 13 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది.ఇకపోతే మృతుల్లో 9 మంది మహిళలు కాగా 11 ఏళ్ల బాలుడు సైతం ఉన్నారు.అయితే ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వంప్రమాదంపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించింది. దీంతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ త్రిసభ్యకమిటీలో టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, శ్రీకాకుళం ASP కేవీ రమణ, దేవాదాయశాఖ సహాయ కమిషనర్ ప్రసాద్ ఉన్నారు.ఈ త్రిసభ్యకమిటీ తొక్కిసలాటకు గల కారణాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.
మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందజేసింది. రూ.15లక్షల చొప్పున పరిహారాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అందించారు. అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని చెప్పారు. కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది మరణించగా, 25 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. కార్తిక ఏకాదశి సందర్భంగా స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో ఉదయం నుంచి ఆలయం కిటకిటలాడింది. భక్తులంతా ఒకేసారి ఆలయంలోకి ప్రవేశించే క్రమంలో తోపులాట జరిగి.. అది తొక్కిసలాటకు దారితీసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

