STAMPADE: వేంకటేశా.. నీకిది తగునా..?

STAMPADE: వేంకటేశా.. నీకిది తగునా..?
X
తెలుగు రాష్ట్రాల్లో మరో విషాదం.. దైవ సన్నిధిలో మృత్యు ఘోష

తెల్లవారితే కార్తీక శుద్ధ ఏకాదశి. పొద్దుపొద్దునే అమ్మ నిద్రలేచింది. బిడ్డను లేపుతూ.. ఈ రోజు కార్తీకంలోనే అత్యంత మహిమాన్వితమైన రోజు. శివకేశవులను దర్శించుకుంటే అన్ని శుభాలు కలుగుతాయని చెప్పింది. ఇది విన్న పక్కింటి అక్క.. పక్కనే ఉన్న పెద్దమ్మను శ్రీవారి దర్శించుకుందామని పురమాయించింది. ఇలా తాత నుంచి తంబి వరకు, తల్లి నుంచి చెల్లి వరకు అంతా.. రెడీ అయ్యారు. శ్రీవారి సన్నిదికి చేరకున్నారు. మరికొద్ది సేపట్లో స్వామివారి దర్శనం చేసుకుంటామనే ఆనందం. అయితే, శ్రీనివాసుని సన్నిధే.. వారికి చివరి వేదిక అవుతుందని ఊహించలేకపోయారు. రెయిలింగ్‌ రూపంలో మృత్యువు వెంటాడింది. తొక్కిసలాట జరిగి 9 మృతి చెందారు. గోవింద నామం రావాల్సిన భక్తుల నోటి నుంచి.. హాహాకారాలు వినిపించాయి. శ్రీవేంకటేశా వాళ్లు చేసినా తప్పేంటి.. నీ సన్నిధికి వచ్చిన వారికి ఈ రకమైనా శిక్ష వేయడం నీకు తగునా..?

కా­శీ­బు­గ్గ­లో తీ­వ్ర వి­షాద ఘటన చో­టు­చే­సు­కుం­ది. స్థా­నిక వేం­క­టే­శ్వ­ర­స్వా­మి ఆల­యం­లో తొ­క్కి­స­లాట జరి­గిం­ది. ఈ ఘట­న­లో 9 మంది భక్తు­లు మృతి చెం­దా­రు. పలు­వు­రి­కి తీ­వ్ర­గా­యా­ల­య్యా­యి. మృ­తుల సం­ఖ్య పె­రి­గే అవ­కా­శం ఉంది. ఏకా­ద­శి సం­ద­ర్భం­గా వేం­క­టే­శ్వర స్వా­మి ఆల­యా­ని­కి భక్తు­లు భా­రీ­గా పో­టె­త్తా­రు. ఈ నే­ప­థ్యం­లో­నే తొ­క్కి­స­లాట చో­టు­చే­సు­కుం­ది. పలు­వు­రు భక్తు­లు స్పృ­హ­త­ప్పి పడి­పో­యా­రు. ఘట­నా­స్థ­లి­లో సహా­య­చ­ర్య­లు కొ­న­సా­గు­తు­న్నా­యి. క్ష­త­గా­త్రు­ల­ను స్థా­నిక ఆస్ప­త్రు­ల­కు తర­లి­స్తు­న్నా­రు. ఈ ప్ర­మా­దం­లో ఏడు­గు­రు ఘట­నా­స్థ­లి­లో­నే మృతి చెం­దా­రు. ఇద్ద­రు ఆస్ప­త్రి­లో చి­కి­త్స పొం­దు­తూ ప్రా­ణా­లు కో­ల్పో­యా­రు. మృ­తు­ల్లో 8 మంది మహి­ళ­లు, 12 ఏళ్ల బా­లు­డు ఉన్నా­రు. సు­మా­రు 25 మంది గా­య­ప­డి­న­ట్లు సమా­చా­రం. వీ­రి­లో ఇద్ద­రి పరి­స్థి­తి వి­ష­మం­గా ఉన్న­ట్లు తె­లు­స్తోం­ది. మృ­తు­ల­ను టె­క్క­లి మం­డ­లం రా­మే­శ్వ­రా­ని­కి చెం­దిన చి­న్న­మ్మి (50), పట్టి­ల­సా­రి గ్రా­మా­ని­కి చెం­దిన రా­పాక విజయ (48), వజ్ర­పు­కొ­త్తూ­రు మం­డ­లా­ని­కి చెం­దిన నీ­ల­మ్మ (60), మం­ద­స­కు చెం­దిన రా­జే­శ్వ­రి (60), బృం­దా­వ­తి (62) నం­ది­గాం మం­డ­లా­ని­కి చెం­దిన యశో­ద­మ్మ (56), సోం­పే­ట­కు చెం­దిన ని­ఖి­ల్‌ (13), పలా­స­కు చెం­దిన అమ్ము­డ­మ్మ­గా గు­ర్తిం­చా­రు. రూప అనే మరో మహిళ కూడా ప్రా­ణా­లు కో­ల్పో­యిం­ది. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు కేంద్రం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

తొక్కిసలాట మృతులు వీరే..

కా­శీ­బు­గ్గ శ్రీ­వెం­క­టే­శ్వర స్వా­మి ఆల­యం­లో జరి­గిన తొ­క్కి­స­లాట ఘట­న­లో 9 మంది మర­ణిం­చా­రు. 30 మంది తీ­వ్రం­గా గా­య­ప­డ్డా­రు. మృ­తు­లు.. రా­పాక విజయ(టె­క్కి­లి), ఏదూ­రి చి­న్మ­మ్మి(రా­మే­శ్వ­రం), ము­రి­పిం­చి నీ­ల­మ్మ(దు­క్క­వా­ని­పేట), దు­వ్వు రా­జే­శ్వ­రి(చె­లు­ప­టి­యా), యశో­ద­మ్మ(శి­వ­రాం­పు­రం), రూప(గు­డి­భ­ద్ర), డో­క్కర అమ్ము(పలాస), ని­ఖి­ల్‌(బెం­కి­లి), బృం­దా­వ­తి(మందస)గా గు­ర్తిం­చా­రు. మృ­తుల సం­ఖ్య పె­రి­గే అవ­కా­శం ఉం­ద­ని అధి­కా­రు­లు తె­లి­పా­రు.




Tags

Next Story