ఏపీ ఎస్‌ఈసీపై సీఐడీ నమోదు చేసిన కేసుపై స్టే

ఏపీ ఎస్‌ఈసీపై సీఐడీ నమోదు చేసిన కేసుపై స్టే
ఏపీ ఎన్నికల కమిషన్‌పై సీఐడీ దర్యాప్తుపై స్టే ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.. ఈసీ సిబ్బందిపై సీఐడీ అధికారులు నమోదు.,.

ఏపీ ఎన్నికల కమిషన్‌పై సీఐడీ దర్యాప్తుపై స్టే ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.. ఈసీ సిబ్బందిపై సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసులు, దర్యాప్తును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టును ఆశ్రయించింది.. ఎన్నికల కమిషన్‌ తరపున న్యాయవాదులు సీతారామమూర్తి, అశ్విన్‌ కుమార్‌ వాదనలు వినిపించారు.. ఎన్నికల కార్యాలయ సిబ్బంది విధులకు సీఐడీ అధికారులు ఆటంకం కలిగిస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్‌ తరపు న్యాయవాదులు.. ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసేంత వరకు ఈ కేసులో తదుపరి చర్యలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. ఎన్నికల కమిషన్‌ వేసిన పిటిషన్‌, సాంబమూర్తి వేసిన పిటిషన్‌ను కలిపి విచారిస్తామన్న హైకోర్టు.. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story