Suicide : ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్య

X
By - Vijayanand |30 March 2023 5:22 PM IST
అనంతపురం నగరంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది.. కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.. నగరంలోని రంగస్వామి నగర్‌కు చెందిన మహమ్మద్ రఫీ బిల్డర్ పని చేస్తున్నాడు.. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.. ఈనెల 28న భార్యతో గొడవపడిన రఫీ.. ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయాడు.. సాయంత్రం వరకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.. ఇవాళ ఉదయం బుక్కరాయ సముద్రం చెరువులో మూడు మృతదేహాలు కనిపించాయి.. చనిపోయిన వారు రఫీ, అతని ఇద్దరు పిల్లలుగా పోలీసులు తేల్చారు.. ఈ ఘటనతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com