అవినాష్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలన్న వైఎస్‌ సునీత

అవినాష్‌రెడ్డి  బెయిల్‌ను రద్దు చేయాలన్న వైఎస్‌ సునీత
అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని వైఎస్‌ వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌ ఇవాళ రిజస్ట్రీ ముందుకు రానుంది.

వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని వైఎస్‌ వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌ ఇవాళ రిజస్ట్రీ ముందుకు రానుంది. మరోవైపు వివేకా హత్య కేసులో సీబీఐ... కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని 8వ నిందితుడిగా చేర్చింది. ఈనెల 3న అవినాష్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి హైకోర్టు ఆదేశాల మేరకు బెయిల్‌పై విడుదల చేసింది. ఇక ఇదే కేసులో వైఎస్‌ భాస్కరరెడ్డిని 7వ నిందితుడిగా పేర్కొంది. భాస్కర్‌రెడ్డి బెయిలు పిటిషన్‌పై దాఖలు చేసిన కౌంటరులో సీబీఐ కీలక విషయాలు తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story