Chandrababu: సుప్రీం కోర్టులో చంద్రబాబు బిగ్ రిలీఫ్..

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఇదే కేసులో సహ నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకూ వర్తిస్తాయని స్పష్టం చేసింది. 2022లో ఈ కేసుపై ఎస్‌ఎల్‌పీ దాఖలైంది. అందువల్ల 17ఏ నిబంధన వర్తిస్తుందా? అని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. విభిన్న అభిప్రాయాలతో ఇచ్చిన తీర్పునకు, ఈ కేసుకూ సంబంధం ఉందా? అని ఆరా తీసింది. పలు ఐపీసీ సెక్షన్లు కూడా ఈ కేసుపై ఉన్నాయని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది వివరించారు.
సెక్షన్ 420 కింద కూడా దర్యాప్తు జరుగుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ఆ సెక్షన్ ఎలా వర్తిస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. చంద్రబాబుకు సంబంధించి సుప్రీం కోర్టులో ఉన్న ఇతర కేసుల వివరాలను కోరగా ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ధర్మాసనానికి అందజేశారు. అన్ని వివరాలు పరిశీలించిన న్యాయస్థానం.. మిగతా కేసుల్లో సాధారణ బెయిల్ కూడా మంజూరైంది కదా అని వ్యాఖ్యానించింది. కొన్ని కేసుల్లో సాధారణ బెయిల్, మరికొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ వచ్చిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. సహ నిందితులు బెయిల్‌పై ఉన్నప్పుడు చంద్రబాబు కూడా బయటే ఉంటే నష్టమేంటని ధర్మాసనం ప్రశ్నించింది.
అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ అక్రమాల కేసులో మాజీ సీఎం చంద్రబాబును విచారించేందుకు పీటీ వారంట్ కోరుతూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో సెప్టెంబర్ 12న సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. ఆ సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ అక్రమాల కేసులో కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని సీఐడీ భావిస్తోంది. ఈ కేసులో పూర్తి ఆధారాలతో చంద్రబాబు, నారాయణ, లోకేశ్‌తోపాటు వారి బినామీలైన లింగమనేని రమేశ్, లింగమనేని రాజశేఖర్, ఆర్కే హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ అంజినీ కుమార్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
ఈ కేసులో చంద్రబాబును ఇందులోనూ అరెస్ట్ చేయడానికి సీఐడీ ప్రయత్నించింది. అప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసులో కూడా రిమాండ్ ఖైదీగా పరిగణించాలని న్యాయస్థానాన్ని కోరాలని నిర్ణయించి పీటీ వారంట్ దాఖలు చేసింది. న్యాయస్థానం అనుమతిస్తే ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమాల కేసులో కూడా చంద్రబాబు అరెస్టై జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నట్లుగా పరిగణించే వారు. దీనిపై చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో ఇష్టానుసారంగా మార్పులు చేసి అక్రమాలకు పాల్పడ్డారని సిట్ ఆరోపిస్తోంది. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రులు లోకేశ్, పొంగూరు నారాయణ కలసి అసైన్డ్ భూములను కొల్లగొట్టారని సిఐడి ఆరోపించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com