SEC నిమ్మగడ్డ ఓటు హక్కుపై కొనసాగుతున్న ఉత్కంఠ!

Nimmagadda ramesh kumar
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓటు హక్కు విషయంపై గుంటూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్పందించారు. దుగ్గిరాలలో ఓటు కోసం నిమ్మగడ్డ చేసుకున్న దరఖాస్తును స్థానిక వీఆర్వో తిరస్కరించారని తెలిపారు. దీనిపై విచారణ జరుగుతుందని.. విచారణ అనంతరం ఓటు హక్కు కల్పించాలా? లేదా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మూడవ విడతలో దుగ్గిరాల మండలంలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈలోపు దీనిపై నిర్ణయం ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
అంతకుముందు తన ఓటు హక్కుపై నిమ్మగడ్డ స్పందించారు. పదవీ విరమణ తర్వాత దుగ్గిరాలలోనే ఎక్కువగా గడుపుతానని ఓటు హక్కు కల్పించాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నారు. హైదరాబాద్‌లో ఓటును సరెండర్ చేసినట్టు ఆ ఆధారాలను కూడా జత చేశారు. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానికంగా ఉండడం లేదని ఈ దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. దీనిపై కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నారు నిమ్మగడ్డ. అక్కడి నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్ రాకపోతే కోర్టుకు వెళ్తానని ఆయన తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com