AP Assembly : ఏపీ అసెంబ్లీ నుంచి 11మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

AP Assembly :  ఏపీ అసెంబ్లీ నుంచి 11మంది  టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌
X
AP Assembly : ఏపీ అసెంబ్లీ నుంచి 11మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌ చేశారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం.

AP Assembly : ఏపీ అసెంబ్లీ నుంచి 11మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌ చేశారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం. జంగారెడ్డిగూడెం మరణాలపై వాయిదా తీర్మానం ఇచ్చి...చర్చకు సభలో పట్టుబట్టింది టీడీపీ. దీనిపై ప్రత్యేక చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేసింది. కల్తీసారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలని, నకిలీ బ్రాండ్ల బాగోతం వెలికి తీయాలంటూ నిరసనకు దిగింది. మద్యపాన నిషేధం ఏమైందంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. చర్చ చేపట్టాలంటూ సభలో నినాదాలు చేశారు.సభను టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుకోవడంతో ఒక్క రోజు పాటు సస్పెన్షన్‌ చేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్‌.

Tags

Next Story