Tirupati: తిరుపతి బస్టాండ్‌లో అనుమానాస్పద సూట్ కేస్ కలకలం

X
By - Prasanna |11 Jan 2022 4:00 PM IST
Tirupati: గంటలుగా సూట్‌కేస్ అలాగే ఉండడంతో అనుమానించిన ప్రయాణికులు
Tirupati: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లో అనుమానాస్పద సూట్ కేస్ కలకలం రేపింది. శ్రీకాళహస్తి బస్సులు నిలిచే 10, 11 ప్లాట్ ఫామ్‌ల మధ్య పిల్లర్ పై ఓ సూట్ కేసు ప్రయాణికుల కంటపడింది. గంటల పాటు అది అలాగే ఉండడంతో అనుమానించిన ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంటనే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి దాన్ని పరిశీలించారు. ప్రయాణికులను బస్టాండ్ ఆవరణ నుంచి బయటకు పంపేసి.. సూట్ కేసును నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి తెరిచే ప్రయత్నం చేస్తున్నారు..
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com