కర్నూలు జిల్లాలో కుప్పకూలిన టమాట ధరలు!

కర్నూలు జిల్లాలో కుప్పకూలిన టమాట ధరలు!
కర్నూలు జిల్లాలో టమాట రైతు పరిస్థితి దయనీయంగా మారింది. ఇటు అధికార పార్టీ నేతలు కానీ అటు అధికారులు కానీ టమాట రైతుల గోడును పట్టించుకోవడం లేదు.

కర్నూలు జిల్లాలో టమాట రైతు పరిస్థితి దయనీయంగా మారింది. ఇటు అధికార పార్టీ నేతలు కానీ అటు అధికారులు కానీ టమాట రైతుల గోడును పట్టించుకోవడం లేదు. నిన్నటి వరకు రూపాయికి అమ్ముడు పోయిన కేజీ టమోటా.. ఈరోజు 40 పైసలకు పడిపోయింది. అయితే బహిరంగ మార్కెట్‌లో అయితే కేజీ టమోట 20 రూపాయల నుంచి 25 వరకు అమ్మకాలు సాగుతున్నా.. రైతులకు మాత్రం ఆ ధర చేరడం లేదు. దీంతో తీవ్రంగా నష్టపోయిన టమాట రైతులు అమ్ముకునేందుకు తెచ్చిన సరుకును మార్కెట్‌లోని పశువులకు మేతగా వేసి కంటతడితో ఇంటి ముఖం పడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story