TDP: బోణీ కొట్టిన టీడీపీ... బుచ్చయ్య చౌదరీ ఘన విజయం

TDP: బోణీ కొట్టిన టీడీపీ... బుచ్చయ్య చౌదరీ ఘన విజయం
X

ఆంధ్రప్రదేశ్‌లో వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ తొలి విజయం నమోదు చేసింది. రాజమహేంద్రవరం రూరల్‌ నుంచి టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై 61వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. బుచ్చయ్య గెలుపుతో టీడీపీకి ఘనమైన ఆరంభం లభించింది. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ పిఠాపురంలో భారీ ఆధిక్యం దిశగా సాగుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భారీ మెజార్టీ దిశగా సాగుతున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మంగళగిరిలో లోకేశ్‌ కూడా ఆధిక్యంలో ఉన్నారు. కుప్పం నుంచి పోటీ చేస్తున్న చంద్రబాబు నాయుడు 6000కు పైగా మెజారిటీతో కొనసాగుతున్నారు. పులివెందుల నుంచి పోటీ చేస్తున్న ఏపీ సీఎం జగన్ ప్రస్తుతం ఆదిత్యంలో కొనసాగుతున్నారు. మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న నారా లోకేష్ అయితే ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. లోకేశ్‌ ఎనిమిది వేల ఓట్ల మెజార్టీలో ఉన్నారు. పవన్‌ గెలుపు ఖాయం కావడంతో జనసేన నేతలు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పోస్టులతో సోషల్ మీడియా లో పవన్ పేరు మారుమోగిపోతుంది. పిఠాపురం నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ పేరు కౌంటింగ్ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా మారుమోగిపోతుంది. ఇప్పటికే పిఠాపురంలో పవన్‌ 20 వేలకుపైగా ఓట్ల మెజార్టీలో ఉన్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌ స్టా, ట్విట్టర్‌లో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ పేరే వినిపిస్తోంది. జనసేన అధినేత ఎలక్షన్స్ ప్రయాణం వీడియో షేర్ చేస్తూ అభిమానులు తెగ హంగామా చేస్తున్నారు. ఆయన ప్రచారంలో చేసిన వాగ్దానాలు, మాటలు మళ్ళీ మళ్ళీ పోస్ట్ చేస్తూ షేర్ చేస్తున్నారు. ఇక ఎన్నికలు వేళ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ కొత్త ట్రెండ్ సృష్టించిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ వీడియోస్ అయితే ఎక్కడికక్కడ వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ రియల్ హీరో.. ఫైనల్లీ గెలిచేసారు అంటూ అప్పుడే అభిమానులు ఆయన గెలుపుని డిసైడ్ చేసేస్తున్నారు.

Next Story